'మోడీపై ప్రతీకారం: కాంగ్రెస్‌తో చేతులు కలిపిన వీహెచ్‌పీ!'
న్యూఢిల్లీ: ప్రముఖ విద్యావేత్త మధు కిష్వార్ సామాజిక అనుసంధాన వెబ్‌సైట్ ట్విట్టర్‌లో ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రవీణ్ తొగాడియా (విశ్వహిందూ పరిషత్ నేత), వీహెచ్‌పీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన ప్రతీకారం తీర్చుకుంటున్నాయని పేర్కొన్నారు.
అభివృద్ధి పైనే దృష్టి పెట్టిన మోడీ గుజరాత్‌లో వారి ప్రాభవాన్ని పరిమితం చేశారన్నారు. విశ్వహిందూ పరిషత్ గుజరాత్ కాంగ్రెస్ పార్టీ నేతలతో చేతులు కలిపి మోడీ పైన ప్రతీకారం తీర్చుకుంటోందని పేర్కొన్నారు. ప్రధాని బాగా పాలిస్తుంటే దానిని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆమె ఓ వీడియోను కూడా ఉంచారు.

కాగా, ఇటీవల పార్లమెంటులో మతమార్పిడుల పైన గందరగోళం చెలరేగిన విషయం తెలిసిందే. వీహెచ్‌పీ, ఆరెస్సెస్ ఘర్ వాపసీ పేరుతో హిందుత్వం నుండి ఇతర మతాల్లోకి వెళ్లిన వారిని తిరిగి ఆహ్వానిస్తోంది. దీనిని కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు తప్పుపట్టాయి.
The Togadias within Sangh Parivar are out to derail Modi's ood governance agenda. As in Gujarat, may well be egged on by the Congress
— Madhu Kishwar (@madhukishwar) December 24, 2014 మతమార్పిళ్ల పైన చట్టం తీసుకు వద్దామని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. దీనిని ప్రతిపక్షాలు సమర్థించడం లేదు. మరోవైపు, హిందుత్వం నుండి ఇతర మతాల్లోకి వెళ్లిన వారు స్వచ్ఛందంగా వస్తేనే తాము ఆహ్వానిస్తున్నామని హిందూ సంఘాలు చెబుతున్నాయి. ఇది పార్లమెంటులో రగడగా మారింది.
Togadia & VHP etc taking revenge against Modi since he systematically marginalized them in Gujarat.They even joined hands with Gujju Congis
— Madhu Kishwar (@madhukishwar) December 24, 2014 











Click it and Unblock the Notifications