ప్రతీకారం తీర్చుకుంటాం: మెహిదీ అరెస్ట్‌పై డీసీపీకి బెదిరింపు
బెంగళూరు: సిరియాకు చెందిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఇసిస్) ట్విట్టర్ ఖాతాను నిర్వహిస్తున్నాడన్న ఆరోపణల పైన మెహిదీ మసూద్ బిశ్వాస్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన అరెస్టు నేపథ్యంలో బెంగళూరు టాప్ పోలీసు బాసుకు ట్విట్టర్ అకౌంటులో బెదిరింపు మెసేజ్ వచ్చింది.
దీనిపై బెంగళూరు నగర పోలీసులు కమిషనర్ ఎమ్మెన్ రెడ్డి ఆదివారం స్పందించారు. ఆ మెసేజ్ ఎక్కడి నుండి వచ్చిందో గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. డీసీపీ(క్రైమ్) అభిషేక్ గోయల్‌కు ఆ సందేశం వచ్చింది.
ట్విట్టర్ ఎకౌంట్ ఎవరైనా ఓపెన్ చేయవచ్చునని, అలాగే ఎక్కడి నుండి అయినా పోస్ట్ చేయవచ్చునని కమిషనర్ ఎమ్మెన్ రెడ్డి చెప్పారు. అది ఎక్కడి నుండి వచ్చిందో గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా, గోయల్ ట్విట్టర్ అకౌంటుకు బెదిరింపు సందేశం వచ్చింది.

అందులో.. మా సోదరులను మీ చేతులలో వదిలే ప్రసక్తి లేదని, ప్రతీకారం తీర్చుకుంటామని, మా ప్రతిస్పందనకు వేచి చూడాలని అందులో హెచ్చరించారు. మెహిదీ మసూద్ బిశ్వాస్ అరెస్టు నేపథ్యంలో ఈ సందేశం వచ్చింది. దీనిపై గోయల్ స్పందిస్తూ.. ఈ మెసేజ్‌ను తాను తీవ్రంగా పరిగణించడం లేదన్నారు.
ఐదు రోజుల పోలీసు కస్టడీ
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) తరపున ట్విట్టర్ ఖాతాను నిర్వహిస్తూ పట్టుబడ్డ మెహదీ బిశ్వాస్‌ను ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించారు. శనివారం రాత్రి పట్టుబడ్డ బిశ్వాస్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంతో ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశించారని క్రైమ్ డిసిపి అభిషేక్ గోయల్ వెల్లడించారు. బ్రిటన్ చానెల్-4 అందించిన సమాచారం మేరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేయడంతో బిశ్వాస్ అతి తక్కువ వ్యవధిలో పోలీసులకు చిక్కాడు.












Click it and Unblock the Notifications