జమ్ము కశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్.. 12 మందికి పైగా మృతి..!
జమ్ము కశ్మీర్ లో విషాదం నెలకొంది. క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వరదలు సంభవించాయి. జమ్ము కశ్మీర్ లోని కిష్ట్ వార్ జిల్లా చస్తోటి ప్రాంతంలో వరదలు ముంచెత్తాయి. వరదల్లో 12 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. సమాచారం తెలుసుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. చుట్టుపక్కల ప్రదేశాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు 12 మంది మృతదేహాలు లభ్యం అయ్యాయని అధికారులు తెలిపారు. మరికొంత మంది మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
చస్తోటి ప్రాంతం మచియాల్ మాతా యాత్రకు స్టార్టింగ్ పాయింట్ కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఈ ప్రదేశంలో ఉంటారు. ప్రతి ఏటా ఈ యాత్ర ఉంటుంది. అయితే ఆకస్మిక వరదల కారణంగా యాత్రను రద్దు చేశారు అధికారులు. ఈ ఘటనపై సీనియర్ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ నరేష్ సింగ్ మాట్లాడుతూ.. కిష్ట్ వార్ జిల్లాలోని చస్తోటి ప్రాంతంలో మచియాల్ మాతా యాత్ర ప్రారంభం అవుతుంది. అక్కడే క్లౌడ్ బరస్ట్ కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఆ ప్రాంతంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. అని తెలిపారు.
⚡🚨 Chishoti area of Kishtwar (Jammu division)
— OsintWorld 🍁 (@OsiOsint1) August 14, 2025
Early Reports are coming in of heavy loss of life and property.
DC Kishtwar Confirms 12–15 De@ths in Chositi Cloudburst and many injured. pic.twitter.com/QwPv1wzHPz
మరోవైపు ఇదే ఘటనపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కూడా స్పందించారు. చస్తోటి ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్‌లో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకొనే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. అధికారులు తక్షణమే రంగంలోకి దిగారని సహాయక చర్యలను కొనసాగిస్తున్నారని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ లో కూడా క్లౌడ్ బరస్ట్ కారణంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని అన్నారు.

ఇక ఇటీవల ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బరస్ట్ కారణంగా ధరేలీ గ్రామం మొత్తం కొట్టుకొనిపోయిన విషయం తెలిసిందే. వరద ఒక్కసారిగా పై నుంచి రావడంతో డౌన్ లో ధరేలీ గ్రామంలోని ఇళ్లు, భవనాలు, హోటళ్లు మొత్తం నేలమట్టం అయ్యాయి. ఈ ప్రమాదంలో అనేక మంది మృతి చెందగా స్థానికంగా ఉన్న ఆర్మీ క్యాంప్ నుంచి 10 మంది జవాన్లు కూడా గల్లంతయ్యారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications