జీపును ఢీకొట్టిన రైలు: పెళ్లి విషాదం, 13 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా 13 మంది మృత్యువాత పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని కొత్తిపూర్ ప్రాంతంలో మానవరహిత రైల్వే క్రాసింగ్ వద్ద జీపును రైలు ఢీకొట్టింది.
ఈ ఘటనలో జీపులో ప్రయాణిస్తున్న 13 మంది మృత్యువాత పడగా, ముగ్గురు గాయపడ్డారు. ఓ పెళ్లి వేడుకకు హాజరై తిరిగి జీపులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. జీపులో 16 మంది ఉన్నారు. ఈ సంఘటన బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో జరిగింది.

జీపులో ప్రయాణిస్తున్న 13 మంది అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications