జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం: రైలు దూసుకెళ్లడంతో 12 మంది మృతి, పలువురికి గాయాలు
రాంఛీ: జార్ఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ దాటుతున్న వ్యక్తులను బెంగళూరు-భాగల్పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఖచ్చితమైన సంఖ్యను అధికారులు ప్రకటించాల్సి ఉంది.
అనసోల్ పరిధి జంతారా ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు, రైల్వే పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడినవారిని అంబులెన్స్‌ల్లో హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

'జామ్తారాలోని కలాఝరియా రైల్వే స్టేషన్‌లో రైలు ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. కొన్ని మరణాలు నివేదించబడ్డాయి. ఖచ్చితమైన మరణాల సంఖ్య తరువాత నిర్ధారించబడుతుంది. వైద్య బృందాలు, అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి' అని జమ్తారా డిప్యూటీ కమిషనర్ తెలిపారు.
#WATCH | Jharkhand: On Jamtara train accident, Anant Kumar, SDM Jamtara says, "...Two bodies have been recovered. We've requested Railways to start a helpline number...The reason will be known after investigation..." pic.twitter.com/KZYz7cmI2w
— ANI (@ANI) February 28, 2024
జమతారా ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ మీడియాతో మాట్లాడుతూ.. నేను ఘటనా స్థలానికి బయలుదేరుతున్నాను. ప్రమాదానికి బాధ్యులైన వారిని గుర్తించాలని ఆదేశాలు ఇచ్చాను. అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాం. మృతులను ఇంకా గుర్తించలేదు అని తెలిపారు.
కాగా, జంతారా జిల్లాలోని కల్జారియా ప్రాంతంలో కొంతమంది ప్రయాణికులు రాంగ్ సైడ్ నుంచి రైలు నుంచి దిగడం వల్ల ప్రమాదం జరిగిందని మొదట జంతారా సబ్ డివిజన్ పోలీసు అధికారి (SDPO) రెహమాన్ తెలిపారు. 'ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను వెలికితీశారు. రెస్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది' అని చెప్పారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications