పొగమంచు: ఏడు రోజులైనా ఆ రైలు మీరట్ దాటలేదు
మీరట్: ఉత్తర భారతంలో పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలపై తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రతిరోజు అలహాబాద్‌లో సాయంత్రం 5: 40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:50కి షహరాన్ పూర్ చేరే నౌచండి ఎక్స్‌ప్రెస్... ఏడు రోజులైనా మీరట్ దాటక పోడవం విశేషం.
నిజానికి ఈ రైలు మీరట్‌కు ఉదయం 8:30కి రావాల్సి ఉంది. దట్టమైన పొగ మంచు కారణంగా రైళ్లు రోజూ 6 గంటల నుంచి 8 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో నౌచండీ ఎక్స్‌ప్రెస్‌ను మీరట్ నుంచి వెనక్కి పంపాలని రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

మీరట్, షహరాన్ పూర్‌ల మధ్య నిత్యమూ తిరుగుతుండే ఉద్యోగులు, విద్యార్ధులు ఈ ట్రైన్ పైనే ఎక్కువ ఆధారపడి ఉంటారు. పొగమంచు కారణంగా మరుసటి రోజు రైలును రద్దు చేసేకన్నా మీరట్ నుంచి వెనక్కు పంపడం మేలని రైల్వే అధికారులు వ్యాఖ్యానించారు.
నౌచండీతో పాటు ఉత్తర భారతంలో మరికొన్ని రైళ్లు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. ఇక బుధవారం మీరట్-లక్నో రాజధాని ఎక్స్‌ప్రెస్ పొగమంచు కారణంగా రద్దు చేశారు. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో చాలా మంది ప్రయాణీకులు టిక్కెట్లను రద్దు చేసుకుంటున్నారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications