రైలులో లోయర్ బెర్తులకు ‘ఎక్కువ’ చెల్లించాల్సిందే?: పండగలొస్తే బాదుడే

Recommended Video

    రైలులో లోయర్ బెర్తులకు.. ఇక ‘ఎక్కువ’ చెల్లించాల్సిందే !

    న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రైల్వే శాఖలో అనేక ప్రతిపాదనలు వస్తున్నాయి. దిగువ బెర్తులు ఎంపిక చేసుకునేవారు, పండుగల సీజన్‌లో ప్రయాణాలు చేసేవారి నుంచి అధిక రుసుములు వసూలు చేయాలని ఛార్జీల సమీక్ష కమిటీ సిఫార్సు చేసింది.

    విమానయాన సంస్థలు హోటళ్లు అనుసరించిన రీతిలో రైల్వేలోనూ డైనమిక్‌ ఛార్జీల విధానం ఉండాలని సూచించింది. ఈ కమిటీ తన నివేదికను సోమవారం రైల్వే బోర్డుకు సమర్పించింది. అందులో ప్రధాన సిఫార్సులను గమనించినట్లయితే..

    Train travel: Be ready to pay more for lower berth, festive-season ticket

    - నిర్దిష్ట మార్గంలో 'అనుకూల' సమయాల్లో నడిచే రైళ్లు, ప్రజాదరణ ఎక్కువగా ఉండే రైళ్లలోనూ ఛార్జీలను పెంచాలి.
    -రాత్రిపూట ప్రయాణించే రైళ్లలోనూ, వంటశాల (ప్యాంట్రీ కార్‌) కలిగిన రైళ్లకు ప్రీమియం ఛార్జీలు ఉండాలి.
    - విమానాల్లో ముందు సీట్ల కోసం ప్రయాణికులు అధిక రుసుములు చెల్లించాల్సి ఉంటుందని, ఇదేరీతిలో రైళ్లలో కోరుకున్న సీట్ల కోసం ప్రయాణికులు ఎక్కువ మొత్తం చెల్లించాలి.
    - ఎప్పుడూ ఒకేరకం రుసుములు నిర్దేశించడానికి బదులు పండుగల సీజన్‌లో ఎక్కువగా, రద్దీ పెద్దగా లేని నెలల్లో తక్కువగా ఛార్జీలు ఉండాలి.
    - అసౌకర్యంగా ఉండే సమయాల్లో గమ్యస్థానాలకు చేరే రైళ్లలోని ప్రయాణికులకు రాయితీలను ఇవ్వాలి. కాగా, రైల్వే బోర్డు ఈ సిఫార్సులను ఆమోదించినట్లయితే ఇవి అమల్లోకి వస్తాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+