శబరిమల స్పాట్ బుకింగ్స్ పై దేవస్థానం నిర్ణయంలో మార్పు, ఇక నుంచి..!!

శబరిమలకు వెళ్తున్న అయ్యప్ప భక్తులకు బిగ్ అప్డేట్. దేవస్థానం ఇప్పటికే పెరుగుతున్న రద్దీ మేరకు స్పాట్ బుకింగ్స్ పై పరిమితులు విధించింది. కాగా.. ఇప్పుడు వాటిని సడలించే యోచన చేస్తోంది. రద్దీకి అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలు.. కేరళ ప్రభుత్వం సూచనలతో దర్శనం కోసం 75 వేల మంది భక్తులనే పరిమితం చేశారు. స్పాట్ బుకింగ్స్ కూడా 20 వేల నుంచి 5 వేలకు తగ్గించారు. ఇప్పుడు ఈ సంఖ్య కొంత మేర పెంచే విధంగా కసరత్తు కొనసాగుతోంది.

శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తాజాగా
కేరళ హైకోర్టు భక్తులు రద్దీలో చిక్కుకోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో భక్తుల సంఖ్యను 20,000 నుండి 5,000కు తగ్గించారు. పంపాతో సహా 3 ప్రదేశాలలో పనిచే స్తున్న ఇన్‌స్టంట్ బుకింగ్ కేంద్రాలు మూసివేశారు. దేవస్థానం బోర్డు తీసుకున్న ఈ కఠినమైన చర్య వల్ల స్పాట్ బుకింగ్ ద్వారా వచ్చే భక్తుల సంఖ్య తగ్గినట్లు గుర్తించారు.

Travancore Devaswom Board Planning to increase spot booking limits in Sabarimala

కాగా.. భక్తుల రద్దీని బట్టి స్పాట్ బుకింగ్స్ పెంచుకోవడానికి దేవస్థానం బోర్డుకు కేరళ హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం భక్తుల రద్దీని బట్టి స్పాట్ బుకింగ్స్ ద్వారా అనుమతించిన భక్తుల సంఖ్యను పెంచే విధంగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. దీంతో మళ్లీ స్పాట్ బుకింగ్స్ పెంచాలని నిర్ణయం తీసుకున్న దేవస్థానం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు చేస్తోంది.

తాజాగా, కేరళ రాష్ట్ర డీజీపీ శబరిమల సందర్శించారు. భద్రతా చర్యలను కూడా పరిశీలించారు. శబరిమల సందర్శించే భక్తుల భద్రత, సౌకర్యాన్ని నిర్ధారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని డీజీపీ అన్నారు. భక్తుల రద్దీని బట్టి స్పాట్ బుకింగ్స్ ద్వారా అనుమతించిన భక్తుల సంఖ్యను 7,000 నుండి 8,000కు పెంచాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు.

శబరిమలలో మండల పూజల నిమిత్తం ఈ నెల 16న అయ్యప్ప స్వామి సన్ని ధానం ఆలయం తలుపులు తెరుచుకోగా.. వారం రోజుల్లో ఆరున్నర లక్షల మంది స్వామిని దర్శించుకున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) అధికారులు ప్రకటించారు. ఆదివారం నుంచి స్పాట్ బుకింగ్‌లను పెంచడంతో.. సోమవారం నుంచి భక్తుల తాకిడి మరింత పెరిగింది. ప్రస్తుతం పంపాబేస్, శరణ్‌గుత్తి, నడపండల్, సన్నిధానం.. ఇలా ఎక్కడ చూసినా.. అయ్యప్ప భక్తులే కనిపిస్తున్నారు. ప్రస్తుతం 18 మెట్లపై నిమిషానికి సగటున 85 మంది భక్తులను అనుమ తిస్తున్నట్లు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+