ఢిల్లీ, జమ్మూకాశ్మీర్‌లో భూ ప్రకంపనలు: ఆఫ్ఘనిస్థాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం
న్యూఢిల్లీ: గురువారం సాయంత్రం ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం సంభవించింది. దీంతో ఢిల్లీ-ఎన్సీఆర్, జమ్మూ కాశ్మీర్, పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. రిక్టార్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 5.9గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ప్రకారం.. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్లోని ఫైజాబాద్‌లో ఉంది.
Earthquake of Magnitude:5.9, Occurred on 05-01-2023, 19:55:51 IST, Lat: 36.39 & Long: 70.66, Depth: 200 Km ,Location: 79km S of Fayzabad, Afghanistan for more information Download the BhooKamp App https://t.co/NNNsRSzym0@Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/Um0iJGWieT
— National Center for Seismology (@NCS_Earthquake) January 5, 2023
కాగా, దేశ రాజధానిలో ప్రకంపనలు రావడం వారంలో ఇది రెండోసారి. ఢిల్లీలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలంతా భయాందోళనలకు గురయ్యారు. నివాసాలు, కార్యాలయాల నుంచి బయటకి పరుగులు తీశారు. తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలిసింది.

జనవరి 1న, తెల్లవారుజామున ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో రిక్టార్ స్కేలుపై 3.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. కేంద్రం నుంచి వచ్చిన రీడింగుల ప్రకారం.. భూకంపం 3.8గా నమోదైంది. హర్యానాలోని ఝజ్జర్‌కు ఉత్తర వాయువ్య దిశలో తెల్లవారుజామున 1:19 గంటలకు భూకంపం సంభవించింది. భూకంపం లోతు భూమికి 5 కి.మీగా ఉంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications