Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

west bengal bypoll results:బెంగాల్ ఉపపోరులో టీఎంసీ జోరు-బీజేపీ సిట్టింగ్ సీట్లలోనూ మెజార్టీ

పశ్చిమబెంగాల్లో తాజాగా ఉపఎన్నికలు జరిగిన నాలుగు అసెంబ్లీ స్ధానాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ సత్తా చాటు కుంటోంది. ఈ నాలుగు స్ధానాల్లో రెండు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెల్చినవి కావడం విశేషం. మరో రెండు స్ధానాల్లో తృణమూల్ ఎమ్మెల్యేల మరణంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి.

పశ్చిమబెంగాల్లోని దిన్హాటా, శాంతిపూర్ అసెంబ్లీ సీట్లను ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెల్చుకుంది. దిన్హాటాలో బీజేపీ తరఫున ఎంపీగా ఉన్న నితీశ్ ప్రమాణిక్ పోటీ చేయగా.. శాంతీపూర్ లో మరో ఎంపీ జగన్నాథ్ సర్కార్ పోటీ చేశారు. అయితే ఈ రెండు సీట్లనూ బీజేపీ గెల్చుకుంది. కానీ ఎలాగో బీజేపీ అధికారంలోకి రాకపోవడంతో వీరిద్దరూ ఎంపీ సీట్లను వదులుకుని ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసేందుకు ఇష్టపడలేదు. దీంతో ఈ రెండు స్ధానాల్లో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇప్పుడు ఈ రెండు సీట్లలోనూ తృణమూల్ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది.

trinamool congress is set to wrest two seats from bjp in west bengal bypolls

దిన్హాటాలో టీఎంసీ అభ్యర్ధి ఉదయన్ గుహా బీజేపీ అభ్యర్ధి అశోక్ మండల్ పై దాదాపు లక్ష ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే శాంతీపూర్ లో టీఎంసీ అభ్యర్ధి బ్రజ్ కిషోర్ గోస్వామి సమీప బీజేపీ ప్రత్యర్ధి నిరంజన్ బిశ్వాస్ పై ఆధిక్యం కనబరుస్తున్నారు. ఈ రెండు సీట్లను టీఎంసీ తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది అలాగే సీఎం మమతా బెనర్జీ కోసం భవానీపూర్ సీటు వదులుకున్న సోవన్ దేవ్ ఛటోపాధ్యాయ్ ఈసారి ఖర్దాహా నుంచి బరిలోకి దిగారు. ఆయన ప్రస్తుతం బీజేపీ అభ్యర్ధి జాయ్ సాహా పై ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+