ట్రిపుల్ తలాక్: మే 11 నుంచి వాదనలు విననున్న బెంచ్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ అంశంపై వాదనలను రాజ్యాంగ బెంచ్ మే 11వ తేదీ నుంచి విననుంది. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై వాదనలు ప్రారంభం కానున్నాయి. అయిదుగురు జడ్జిలతో కూడిన బెంచ్ దీనిపై వాదనలు విని, నిర్ణయించనుంది.

ట్రిపుల్ తలాక్ అనైతికం: సుబ్రహ్మణ్య స్వామి

ట్రిపుల్ తలాక్ చెప్పి ముస్లిం మహిళలతో భర్తలు తెగతెంపులు చేసుకోవడం అనైతికమని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఈ వివాదాస్పదమైన పద్ధతి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. స్త్రీ, పురుషుల మధ్య అసమానత్వాన్ని భారత సమాజం ఎంతమాత్రం అంగీకరించదన్నారు.

Triple talaq: Constitution bench to hear matter from May 11 onwards

గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం, నైతికత, పబ్లిక్ ఆర్డర్, ఆరోగ్యం వంటి అంశాల్లో మతస్వేచ్ఛకూ కొన్ని ఆంక్షలు ఉంటాయన్నారు.

మహిళలతో ప్రవర్తించేది ఇలాగేనా? మగవాళ్లు మూడుసార్లు తలాఖ్ చెప్పి భార్యలను వదిలించుకోవడాన్ని అనుమతించాలా? ఇది పూర్తిగా అనైతకమన్నారు. పురుషులూ, మహిళలూ సమానం కాదని చెప్పడమే అవుతుందన్నారు. ఇందెంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A constitution bench will hear the matter pertaining to triple talaq from May 11 onwards. The constitution bench will go into the legality of the law behind triple talaq after a petition seeking to ban the practise was filed.
Please Wait while comments are loading...