త్రిపుర కొత్త సీఎంగా మానిక్ సాహా.. బీజేపీ స్టేట్ చీఫ్‌కే పగ్గాలు
త్రిపుర కొత్త సీఎంను బీజేపీ ప్రకటించింది. బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామాతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. అయితే బీజేపీ హైకమాండ్ మానిక్ సహాకు సీఎం పగ్గాలు అప్పగించింది. ఆయన త్రిపుర బీజేపీ చీఫ్, రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు.

ఇవాళ మధ్యాహ్నం సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ తన పదవీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. మానిక్ సాహా 2016లో కాంగ్రెస్ పార్టీని వీడారు. 2020లో బీజేపీ త్రిపుర రాష్ట్ర శాఖ పగ్గాలు చేపట్టారు. గతేడాది నవంబర్‌లో జరిగిన 13 స్థానిక సంస్థల్లో బీజేపీ విజయం సాధించింది. ఇందులో సాహా కీలక పాత్ర పోషించారు.
మానిక్ సహాకు మాజీ సీఎం బిప్లవ్ దేవ్ అభినందనలు తెలియజేశారు. ప్రధాని మోడీ ముందుచూపు, నాయకత్వంతో దేశం ముందడుగు వేస్తుందని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అయితే వచ్చే ఏడాది త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ సీఎంను మార్చింది. సీఎం పదవీని స్టేట్ బీజేపీ చీఫ్‌కు కట్టబెట్టింది. బిప్లవ్‌కు రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పగించనుంది.