యూపీలో అఖిలేష్ కు షాక్-ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు

యూపీలో అసెంబ్లీ ఎన్నికల పోరు నాలుగో దశకు చేరుకుంది. ఇప్పటికే పూర్తయిన మూడు దశల్లో బీజేపీ, ఎస్పీల్లో ఎవరు ముందున్నారో తెలియకపోయినా, తర్వాతి దశ ఎన్నికల్లో పరస్పరం టార్గెట్ చేసుకోవడం మాత్రం ఎక్కువైంది. ఇందులో భాగంగా సమాజ్ వాదీ పార్టీ ఛీఫ్ అఖిలేష్ యాదవ్ పై తాజాగా ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసు నమోదైంది. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా కలకలం రేపుతోంది.

కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలోని సఫాయ్ పట్టణంలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌పై కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లో మూడో విడత పోలింగ్‌ సందర్భంగా ఆదివారం సఫాయ్‌లోని పోలింగ్ బూత్ వెలుపల మీడియా సిబ్బందితో మాట్లాడినందుకు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌పై ఫిర్యాదు నమోదైంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్, ఆయన భార్య డింపుల్ యాదవ్‌తో కలిసి ఓటు వేసిన తర్వాత, ఉత్తరప్రదేశ్‌లో క్షీణిస్తున్న శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై మండిపడ్డారు. దీంతో ఆయన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే కాకుండా, కోవిడ్ 19 ప్రోటోకాల్‌లను కూడా ఉల్లంఘించారని కొందరు ఫిర్యాదు చేశారు.

trouble for Akhilesh Yadav In UP elections, police case for Violating Poll Code

అఖిలేష్ యాదవ్ తన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కర్హాల్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేతపై బీజేపీ కేంద్ర మంత్రి సత్యపాల్‌ సింగ్‌ బఘేల్‌ను పోటీకి దింపింది. దీంతో వీరిద్దరి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.

Recommended Video

    Punjab Elections 2022 | Up Elections 3rd Phase | Polling Update

    ఇది మాటల యుద్ధానికి కూడా దారి తీస్తోంది. ఈ నేపథ్యంలోనే అఖిలేష్ పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మూడో దశ ఎన్నికల్లో 61.61 శాతం ఓటింగ్ నమోదైంది. మార్చి 7న చివరి దశ ఓటింగ్‌, మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. మార్చి 12న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+