అన్నాడీఎంకే పార్టీ సింబల్, హైకోర్టును ఆశ్రయించిన శశికళ వర్గం, మాకు ఇంకా టైం కావాలి !
చెన్నై: జయలలిత మరణించిన తరువాత ముక్కలు అయిన అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం కోసం ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. రెండాకుల చిహ్నం కేటాయించే విషయంలో మాకు ఇంకా సమయం కావాలని, ఎన్నికల కమిషన్ కు మీరు సమయం ఇవ్వాలని ఆదేశించాలని శశికళ వర్గం హైకోర్టును ఆశ్రయించింది.
పళనిసామి, పన్నీర్ సెల్వం రెండు వర్గాలుగా చీలిపోయిన సమయంలో రెండాకుల చిహ్నం రద్దు చేస్తూ భారత ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకునింది. తరువాత పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గాలు కలిసిపోయి భారత ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్లు సమర్పించారు.

రెండాకుల చిహ్నం కోసం తమిళనాడు ప్రభుత్వం, టీటీవీ దినకరన్ వర్గం పోటీ పడుతున్నారు. రెండాకుల చిహ్నం అక్టోబర్ 6వ తేదీ కేటాయిస్తామని, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 28వ తేదీలోపు అఫిడవిట్లు సమర్పించాలని భారత ఎన్నికల కమిషన్ సూచించింది.
అఫిడవిట్లు సమర్పించడానికి తమకు ఇంకా సమయం కావాలని టీటీవీ దినకరన్ భారత ఎన్నికల కమిషన్ కు మనవి చేశారు. ఇప్పటికే చాల సమయం ఇచ్చామని, ఇంకా టైం ఇవ్వడం సాధ్యం కాదని భారత ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో తాము అఫిడవిట్లు సమర్పించడానికి సమయం ఇవ్వాలని భారత ఎన్నికల కమిషన్ ను ఆదేశించాలని టీటీవీ దినకరన్ మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ లో మంగళవారం ఫిటిషన్ దాఖలు చేశాడు.












Click it and Unblock the Notifications