ఢిల్లీ చేరిన అన్నాడీఎంకే పంచాయితీ: పళని, పన్నీర్ కు పోటీగా ఈసీని ఆశ్రయించిన టీటీవీ !
అన్నాడీఎంకే పార్టీ వర్గ పోరు మళ్లీ ఢిల్లీకి చేరింది. అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళను నియమిస్తూ గతంలో ఇచ్చిన అఫిడవిట్లను వాపస్ తీసుకొని రెండాకుల చిహ్నం సొంతం.
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ వర్గ పోరు మళ్లీ ఢిల్లీకి చేరింది. అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళను నియమిస్తూ గతంలో ఇచ్చిన అఫిడవిట్లను వాపస్ తీసుకొని రెండాకుల చిహ్నం సొంతం చేసుకోవడానికి ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం ప్రయత్నాలు మొదలుపెట్టారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గాలకు రెండాకుల చిహ్నం ఇవ్వకూడదని, మాకే ఇవ్వాలని టీటీవీ దినకరన్ వర్గం భారత ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించింది. రెండాకుల చిహ్నం ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వంకు ఇవ్వకూడదని మంగళవారం భారత ఎన్నికల కమిషన్ కు టీటీవి వర్గం ఫిర్యాదు చేసింది.

శశికళ, టీటీవీ దినకరన్ ను శాశ్వతంగా అన్నాడీఎంకే పార్టీకి దూరం చెయ్యాలని ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం పావులు కదుపుతున్నారు. ఇదే సందర్బంలో ఎడప్పాడి పళనిసామిని సేలం జిల్లా కార్యదర్శి పదవి నుంచి టీటీవీ దినకరన్ తప్పించడంతో ఆయన వర్గంలోని నాయకులు మండిపడ్డారు
ఐదు మంది తమిళనాడు మంత్రుల ను పార్టీ పదవుల నుంచి తప్పించామని టీటీవీ దినకరన్ ప్రకటించారు. ఈ దెబ్బతో శశికళ, టీటీవీ దినకరన్ కు అన్నాడీఎంకే పార్టీకి ఎలాంటి సంబంధం లేదని భారత ఎన్నికల కమిషన్ దగ్గర నిరూపించాలని ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications