Tamil Nadu Polls: తమిళనాడు పోలింగ్ కు ముందే విజయ్ కు బిగ్ షాక్ ?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల (Tamil Nadu assembly election వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా డీఎంకే, అన్నాడీఎంకే కూటములకు విజయ్ (vijay) కొత్త పార్టీ టీవీకే (TVK) గట్టిపోటీ ఇవ్వడంతో పాటు భారీగా ఓట్లు చీల్చబోతున్నట్లు సంకేతాలు వెలువడుతున్న వేళ ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగలబోతోంది.) గతంలో డీఎంకేలో మంత్రిగా పనిచేసిన 8 సార్లు ఎమ్మెల్యే అనంతరం దానికి గుడ్ బై చెప్పి విజయ్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయన ఎన్నికల వేళ టీవీకేకు గుడ్ బై చెప్పేందుకు సిద్దమవుతున్నారట.

టీవీకే కీలక నేత, మాజీ మంత్రి సెంగొట్టయాన్ (Sengottaiyan) త్వరలో టీవీకేను వీడబోతున్నట్లు మరో మాజీ మంత్రి ఎం.ఆర్.విజయభాస్కర్ చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. టీవీకే నుచి సెంగోట్టయాన్ బయటకు వచ్చే యోచనలో ఉన్నారని ఆయన తెలిపారు. టీవీకేలో తనకు గౌరవం లభించడం లేదని సెంగోట్టయాయన్ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు విజయభాస్కర్ పేర్కొన్నారు.

TVK Blow Ex-Minister Sengottaiyan Quits Vijay s Party Ahead of Tamil Nadu Polls

ఒక ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయభాస్కర్ మాట్లాడుతూ, తొందరపడి పొరపాటు నిర్ణయం తీసుకున్నానని సెంగోట్టయాన్ వాపోతున్నారని చెప్పారు. 'మీరు అటువంటి తప్పు చేయవద్దు' అని అన్నాడీఎంకేలోని కొందరు కీలక నేతలకు ఆయన సలహా ఇచ్చారని వెల్లడించారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సెంగోట్టైయన్, రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు. గతంలో అన్నాడీఎంకేలో ఎడప్పాడి పళనిస్వామికి వ్యతిరేకంగా నిల్చిన కారణంగా ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత, నటుడు విజయ్ ఏర్పాటు చేసిన టీవీకేలో చేరారు.

TVK Blow Ex-Minister Sengottaiyan Quits Vijay s Party Ahead of Tamil Nadu Polls

ప్రస్తుతం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. టీవీకే అధినేత విజయ్‌తో పాటు అన్ని పార్టీల నాయకులు, అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అన్నాడీఎంకే నుంచి టీవీకేలోకి వెళ్లిన సెంగోట్టైయన్ .. గోబిచెట్టిపాళయం స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అన్నాడీఎంకే అభ్యర్థిగా కరూర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న ఎం.ఆర్. విజయభాస్కర్, సెంగోట్టైయన్ పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారని ఈ కీలక సమయంలో వెల్లడించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. తవెకలో సెంగోట్టైయన్‌కు తగిన గుర్తింపు లభించలేదన్న ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+