9,10 ఏళ్ల పిల్లలు యువకుడిని బీర్ బాటిల్‌తో గొంతు కోసి చంపారు
న్యూఢిల్లీ: మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వలేదని ఒక వ్యాపారిని ఇద్దరు పిల్లలు (భిక్షగాళ్లు) అతి దారుణంగా హత్య చేసిన సంఘటన దేశ రాజధాని డిల్లీలో జరిగింది. పూల వ్యాపారిని హత్య చేసిన 9, 10 సంవత్సరాల ఇద్దరు పిల్లలను పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఢిల్లీలోని గోవింద్ పుర ప్రాంతంలోని దేవాలయం దగ్గర సంజయ్ కుమార్ (23) అనే వ్యక్తి పూల వ్యాపారం చేస్తున్నాడు. ఇతను శుక్రవారం రాత్రి వ్యాపారం ముగించుకుని పక్క షాప్ లో మద్యం సేవిస్తున్నాడు. అదే సమయంలో (9), (10) వయస్సు ఉన్న ఇద్దరు బాలురు అక్కడికి వెళ్లారు.
డబ్బులు (భిక్షం) ఇవ్వాలని సంజయ్ కుమార్‌ను అడిగారు. డబ్బులు ఇవ్వడానికి అతను నిరాకరించాడు. డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారు. సంజయ్ కుమార్ కు కోపం వచ్చి ఒక బాలుడి చెంప చెల్లుమనిపించాడు. అంతే మరో బాలుడు రెచ్చిపోయాడు.

పక్కనే ఉన్న బీరు బాటిల్ తీసుకుని సంజయ్ కుమార్ తల మీద కొట్టాడు. సంజయ్ కుమార్ కిందపడిపోవడంతో ఇంకొక బాలుడు అతని మీద కూర్చుని పగిలిపోయిన బీర్ బాటిల్ తీసుకుని సంజయ్ కుమార్ గొంతు కోసి వేశాడు. ఆ సందర్బంలో సంజయ్ కుమార్ ఇద్దరిని పక్కకు నెట్టి పారిపోవడానికి ప్రయత్నించాడు.
అయితే నిందితులు ఇద్దరు అతనికి అవకాశం ఇవ్వలేదు. తరువాత డబ్బులు లాక్కుని అక్కడి నుండి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సంజయ్ కుమార్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే అర్దం గొంతు తెగిపోవడం, రక్తం ఎక్కువ పోవడంతో సంజయ్ కుమార్ మరణించాడని పోలీసులు అన్నారు. ఢిల్లీలో రిక్షా కార్మికులుగా పని చేస్తున్న వారి ఇద్దరు పిల్లలు ఇంటి నుండి పారిపోయి వచ్చి భిక్షం ఎత్తుకుంటు బ్రతుకుతున్నారని, ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications