ఖైదీల ప్రేమకథా చిత్రమ్: శిక్ష అనుభవిస్తూ పెళ్లి పీటలు
ఇనుప ఊచలు... తాళం వేసిన గేట్లు... ప్రతి క్షణం శిక్షను గుర్తు చేసే గోడలు... అలాంటి జైలు గదిలో ప్రేమ పుడుతుందంటే నమ్మగలమా? కానీ రాజస్థాన్‌లోని అల్వార్ జైలులో జరిగిన ఈ ఘటన, ప్రేమకు గోడలు ఉండవని మరోసారి రుజువు చేసింది. హత్య కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు... ఒకే జైలు... ఒకే విధి... చివరకు ఒకే బంధం. నేర చరిత్రతో మొదలైన వారి జీవితం, ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ కథలో ప్రధాన పాత్రధారులు నేహా సేత్ మరియు హనుమాన్ ప్రసాద్. ఇద్దరిదీ సాధారణ నేపథ్యం కాదు. నేహా సేత్ తన భర్తను హత్య చేసిన కేసులో దోషిగా తేలి అల్వార్ జైలులో శిక్ష అనుభవిస్తోంది. మరోవైపు హనుమాన్ ప్రసాద్ కూడా హత్య కేసులోనే శిక్ష పడిన ఖైదీ. ఇద్దరూ ఒకే జైలులో, ఒకే గోడల మధ్య కాలాన్ని గడుపుతున్నారు.

జీవితంలో తప్పు చేశాం... కానీ..
జైలులో మాటలు కూడా కొలతలతోనే మాట్లాడాలి. అయినా కొన్ని కార్యక్రమాల్లో, ఉమ్మడి ప్రాంతాల్లో కలుసుకునే సందర్భాలు వీరిద్దరిని దగ్గర చేశాయి. మొదట మాటలు... ఆ తర్వాత బాధలు... చివరకు జీవితం మీద ఉన్న పశ్చాత్తాపం వారిని ఒక్కటిగా మార్చింది. "జీవితంలో తప్పు చేశాం... కానీ మిగిలిన జీవితాన్ని నిజాయితీగా కలిసి గడపాలి" అన్న నిర్ణయానికి వచ్చారు.
కోర్టు మెట్లెక్కి.. పెళ్లి పీటలెక్కి..
ఈ ప్రేమ కథ జైలు ముచ్చట్లకే ఆగలేదు. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో వారు కోర్టును ఆశ్రయించారు. పెళ్లి కోసం పరోల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఖైదీలైనా సరే, వారికి కూడా కొన్ని మౌలిక హక్కులు ఉంటాయని భావించిన కోర్టు, కఠిన షరతులతో పరోల్‌కు అనుమతి ఇచ్చింది. నిర్ణీత సమయానికి వివాహం పూర్తిచేసుకుని మళ్లీ జైలుకు లొంగిపోవాలనే నిబంధనను విధించింది.
ఒకే జైలు... ఒకే నేరం... ఒకే విధి...
అనుకోకుండా కలిసిన ఇద్దరి జీవితాలు ఇలా ఒక ప్రేమకథగా మారడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. నేర చరిత్ర ఉన్నవారికి ప్రేమ, పెళ్లి అవసరమా అనే ప్రశ్నలు ఒకవైపు వినిపిస్తుంటే... "మానవత్వం ఇంకా మిగిలే ఉంది" అని మరోవైపు కొందరు అంటున్నారు.
ఏది ఏమైనా... ఇనుప గోడల మధ్య పుట్టిన ఈ ప్రేమకథ, నిజ జీవితంలోనే ఒక సినిమాలాంటి మలుపుగా మిగిలిపోయింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications