బాలికల కిడ్నాప్: కొండ మీద గ్యాంగ్ రేప్

రాంచీ: సరుకులు తీసుకోవడానికి బయటకు వెళ్లిన ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసిన నిందితులు తరువాత సామూహిక అత్యాచారం చేసి నిర్జనప్రదేశంలో వదిలిపెట్టి వెళ్లిన సంఘటన జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో జరిగింది.

రాంచీ నగరంలో నివాసం ఉంటున్న ఇద్దరు బాలికలు ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. తరువాత సరుకులు తీసుకోవడానికి షాప్ దగ్గరకు నడిచి వెలుతున్న సమయంలో కారులో వచ్చిన ఆరు మంది కామాంధులు బాలికలను కిడ్నాప్ చేశారు.

తరువాత రాంచీలోని బరైతు ప్రాంతంలోని కొండమీదకు తీసుకు వెళ్లి ఇద్దరి మీద ఆరు మంది గ్యాంగ్ రేప్ చేశారు. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తరువాత బాలికలను తీసుకు వెళ్లి నిర్జనప్రదేశంలో వదిలిపెట్టి పరారైనారు.

Two girls gang-raped in Ranchi in Jharkhand

ఇంటికి వెళ్లిన బాలికలు కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. బాలికల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికలను ఆసుపత్రికి తరలించి వైద్య పరిక్షలు చేయించారు.

ఈ ఘటనపై జార్ఖండ్ అసెంబ్లీలో విపక్ష సభ్యులు విరుచుకుపడ్డారు. రాష్ట్ర రాజధాని రాంచీ నగరంలోనే ఇలా జరుగుతుంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలాఉందో అర్థం అవుతుందని మండిపడ్డారు. జార్ఖండ్ లో మహిళలు, బాలికలపై దౌర్జన్యాలు ఎక్కువ అవుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

గత వారంలో బరైతు ప్రాంతంలోనే నివాసం ఉంటున్న ఓ బాలిక స్కూల్ కు వెళ్లడం మానేసింది. నిత్యం తనను యువకులు వేధిస్తున్నారని బాలిక చెప్పడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు బాలికల గ్యాంగ్ రేప్ కేసు దర్యాప్తులో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+