మోసానికీ ఆధార్ కార్డే ఆధారం: రూ.3 కోట్ల రూపాయలను ఊదేశారు!
లక్నో: దేశంలో అన్ని సంక్షేమ పథకాలు, బ్యాంకు అకౌంట్లు సహా దాదాపు అన్ని అవసరాలకూ ఆధార్ కార్డును లింక్ చేసినట్టే.. మోసానికి కూడా దాన్నే ఆధారంగా చేసుకున్నారు ఇద్దరు ఘరానా దొంగలు. ఆధార్ కార్డులను ఫోర్జరీ చేసి మూడు కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడ్డారు. చివరికి పోలీసుల చేతికి చిక్కారు. కటకటాల వెనక్కి వెళ్లారు. ఫోర్జరీ చేసిన ఆధార్ కార్డులతో నకిలీ క్రెడిట్ కార్డులను సృష్టించడం, వాటి ద్వారా నిందితులు షాపింగ్ చేయడం అలవాటుగా చేసుకున్నారు. ఇలా ఏకంగా మూడు కోట్ల రూపాయల మేర విలువ చేసే షాపింగ్ చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.
సందీప్ కుమార్, సందీప్ బేణివాల్ అనే ఇద్దరు బీటెక్ విద్యార్థులు నిందితులుగా తేలింది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంక్ యాజమాన్యం చేసిన ఫిర్యాదు మేరకు ఉత్తర్ ప్రదేశ్ నోయిడాలోని సెక్టార్ 20 పోలీసులు రంగంలోకి దిగారు. కూపీ లాగగా.. ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.

నిందితుల నుంచి వివిధ బ్యాంకులకు చెందిన 29 కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో అయిదు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంక్ సహా వేర్వేరు బ్యాంకులకు చెందిన ఆరు ఏటీఎం కార్డులు, 10 నకిలీ ఆధార్ కార్డులు, ఏడు పాన్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఓ కారు, రూ.20 వేల నగదు కూడా వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరికొంత మంది హస్తం కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications