అరుదైన ఘటన- ఒకే విమానంలో పైలెట్ గా బీజేపీ ఎంపీ, ప్రయాణికుడిగా డీఎంకే ఎంపీ

తాజాగా ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఓ విమానంలో ఇద్దరు వేర్వేరు పార్టీలకు చెందిన ఎంపీలు ప్రయాణిస్తున్నారు. ప్రయాణంలో వారిద్దరూ ఒకరిని ఒకరు కలిసి పలకరించుకున్నారు. అలాగని వారిద్దరూ కలిసి ప్రయాణికులుగా ఆ విమానంలో ప్రయాణం చేయడం లేదు. ఒకరు పైలట్ గా విమానం నడుపుతుంటే మరొకరు ప్రయాణికుడిగా ఉన్నారు. వివరాల్లోకి వెళితే..

డీఎంకే సీనియర్ ఎంపీ దయానిధి మారన్, బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ గత శుక్రవారం ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లే ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్నారు. పార్లమెంటు అంచనాల కమిటీ సమావేశంలో పాల్గొని దయానిధి మారన్ చెన్నైకు తిరిగి వస్తున్నారు. విమానంలోకి మారన్ ఎక్కి ముందు వరుసలో ఉన్న సీట్లో కూర్చున్నారు. అప్పుడు విమాన సిబ్బంది ఈ విమానంలో సీట్లు నిండిపోయాయి అని చెప్పారు. అంతలోనే మీరు కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు అనే స్వరం వినిపించింది. మారన్ వెనక్కి తిరిగి చూడగానే ప్లైట్ కెప్టెన్ యూనిఫామ్ లో ఓ వ్యక్తి కనిపించారు. మాస్క్ కూడా వేసుకుని ఉండటంతో తొలుత గుర్తుపట్టని మారన్.. ఆ తర్వాత మాత్రం గొంతు విని తన సహచర బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీగా గుర్తించి ఆశ్చర్యపోయారు.

two mps dayanidhi maran and rajiv pratap rudy travel in a flight as passenger and pilot

రెండేళ్ల క్రితం అంచనాల కమిటీలో రాజీవ్ ప్రతాప్ రూడీతో కలిసి పనిచేసిన మారన్.. ఇప్పుడు అదే ఎంపీ విమానం నడుపుతుండటాన్ని చూసి ఆశ్చర్యపోయినట్లు దయానిధి మారన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. తన కళ్లను తానే నమ్మలేకపోయానని, థ్యాంక్యూ కెప్టెన్ అంటూ మారన్ తన ఆనందాన్ని ట్వీట్లో పంచుకున్నారు. బీజేపీ ఎంపీగా ఉంటూనే ప్రైవేట్ జెట్ కు పైలట్ గా, కెప్టెన్ గా ఉద్యోగం చేస్తున్న రాజీవ్ ప్రతాప్ రూడీ.. గతంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. అలాగే దయానిధి మారన్ కూడా యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేయడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+