కాశ్మీర్‌లో కూలిన సైనిక హెలికాప్టర్: మృతుల్లో హైదరాబాదీ

శ్రీనగర్: కాశ్మీర్‌లో ఓ సైనిక హెలికాప్టర్ కూలిన ఘటనలో ఇద్దరు సైనికాధికారులు మృతి చెందారు. వీరిలో ఒకరు హైదరాబాద్‌కు చెందినవారు. స్థానిక బందీపుర జిల్లాలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ స్థాయి అధికారి మృతి చెందారు. హైదరాబాదుకు చెందిన అధికారిని మేజర్ తాహిర్ ఖాన్ హుస్సేన్‌గా గుర్తించారు. అతని మృతదేహం గురువారం సాయంత్రం హైదరాబాదుకు చేరుకుంటుంది.

మానన్‌బల్‌లోని వైమానిక కేంద్రం నుంచి శిక్షణ నిమిత్తం బయల్దేరిన ధ్రువ్ హెలికాప్టర్ అనంతరం 30 నిమిషాల్లోనే నేలకొరిగినట్టు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ బుధవారం సాయంత్రం 7 గంటలకు మానస్‌బాల్ నుంచి బయలుదేరింది. ఓ గంట తర్వాత అది కూలిపోయింది.

Two officers killed as Army chopper crashes in J&K

హెలికాప్టర్ కూలిన ఘటనపై విచారణ ఆదేశించారు. హెలికాప్టర్ బుధవారం సాయంత్రం 7 గంటల 43 నిమిషాల సమయంలో కూలిపోయింది. ఆ వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. తొమ్మిది గంటలకు గానీ సంఘటనా స్థలానికి చేరుకులేకపోయారు. కాశ్మీర్‌లోని బండిపొరా జిల్లాలోని సఫపోరా హైట్స్‌‌లో కూలిపోయింది.

హెలికాప్టర్ కూలిన ఘటనలో మరణించిన ఇద్దరు అధికారులను కూడా గుర్తించారు. లెఫ్టెనెంట్ కల్నల్ రాజేష్ గులాటి, మేజర్ తాహిర్ ఖాన్ హుస్సేన్‌గా వారిని గుర్తించారు. గులాటీ డెహ్రాడూన్‌కు చెందినవారు. ఖాన్ హైదరాబాద్‌కు చెందినవారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు.

కూలిన రెండు ఇంజన్ల ఎఎల్‌హెచ్ హెలికాప్టర్‌ను ప్రభుత్వ యాజమాన్యంలోని హిందూస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) తయారు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+