అసలేముంది అందులో.. 2 సెకన్ల వీడియోకి 100 మిలియన్ వ్యూస్ !!
మారుతున్న కాలానుగుణంగా ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా యుగంలో.. ఏ వీడియో ఎప్పుడు, ఎలా వైరల్ అవుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. లక్షల రూపాయల ఖర్చుతో చేసిన కంటెంట్ కూడా కొన్నిసార్లు రెండు, మూడు వందల వ్యూస్ తో ఆగిపోయిన సందర్భాలు కూడా ఉంటున్నాయి. కానీ సాధారణంగా ఓ యూజర్ తీసిన రెండు సెకన్ల క్లిప్ మాత్రం దేశాన్ని ఊపేస్తోంది. ఈ వీడియోకు ఇప్పటివరకు 10 కోట్లకు పైగా వ్యూస్, 1.25 లక్షల లైకులు.. 26 వేల రీపోస్ట్‌లు, 6 వేల కామెంట్లు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం నెట్టింట ట్రెండింగ్ గా మారింది.
ప్రియాంగ ఆటో వీడియో..
ప్రియాంగ అనే అమ్మాయికి 'bud wiser @w0rdgenerator' అనే 'ఎక్స్' అకౌంట్ ఉంది. నవంబర్ 2న తన అకౌంట్‌లో ఆమె పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది. అందులో వైట్ టాప్, వెండి చెవిపోగులు ధరించి ఆటోలో కూర్చుని కెమెరా వైపు కేవలం ఒకసారి చూస్తుంది. వీడియో మొత్తం రెండే సెకన్లు ఉండగా.. 'Makeup ate today'... అనే క్యాప్షన్‌తో ఆ పోస్ట్ పెట్టింది. కేవలం కొన్ని గంటల్లోనే డానికి కోట్ల వ్యూస్ రావడంతో ఆమె సైతం షాక్ అవుతోంది.

ఈ వైరల్ వీడియోపై ఆమె రియాక్ట్ అవుతూ.. నేనే నమ్మలేకపోతున్నా అంటూ వ్యాఖ్యానించింది. పలు మీడియా ఛానెల్స్, డిజిటల్ ప్లాట్‌ఫార్ములు ఆమెను సంప్రదించగా.. తన వీడియో ఇంతటి సంచలనాన్ని సృష్టించడం ఆమెకే అర్థం కావట్లేదని చెప్పింది. మహా అయితే వెయ్యి లైకులు వస్తాయని అనుకున్నానని.. కానీ ఇప్పుడు ఇలా జరగడం ఊహించలేదని తెలిపింది.
Makeup ate today pic.twitter.com/NZ5UFAXxf8
— bud wiser (@w0rdgenerator) November 2, 2025












Click it and Unblock the Notifications
