కిడ్నాప్ చేసి యువతిపై గ్యాంగ్‌రేప్: వీడియో తీసి..

ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని భంక్రోటా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రెండు నెలల క్రితం బాధిత యువతిని రాజు మెహ్రా, ఓంప్రకాశ్ అనే ఇద్దరు యువకులు కిడ్నాప్ చేశారు. ఆమెకు మత్తు మందు ఇచ్చి ఓ గదిలోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఆఘాయిత్యాన్ని వారు వీడియో తీశారు. ఆ వీడియోను బయటపెడతామని బెదిరింపులకు గురిచేస్తూ ఆ యువతిని బలవంతంగా తమ వద్దకు పిలిపించుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.
దీంతో వారి వేధింపులు భరించలేక విషయం తన తండ్రితో చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications