సుప్రీంకోర్టులో ఆ ఇద్దరికీ బిగ్ షాక్
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ అల్లర్ల వెనుక ఉన్న భారీ కుట్ర కేసులో అరెస్ట్ అయిన విద్యార్థి సంఘాల నాయకులు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌కు భారీ షాక్ తగిలింది. వారికి బెయిల్ మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ అర్హత వీరికి లేదని బెంచ్ వ్యాఖ్యానించింది. ఇదే కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న మరో అయిదుమంది నిందితులకు షరతులతో కూడిన బెయిల్ లభించింది. బెయిల్ పొందినవారిలో గుల్ఫిషా ఫాతిమా, మీరన్ హైదర్, షిఫా ఉర్ రెహ్మాన్, మహమ్మద్ సలీం ఖాన్, షాదాబ్ అహ్మద్ ఉన్నారు.
ఢిల్లీలో 2020 ఫిబ్రవరిలో చోటుచేసుకున్న అల్లర్ల కేసుకు సంబంధించిన విచారణ ఇది. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనల మధ్య చెలరేగిన అప్పటి అల్లర్లలో 53 మంది మరణించగా, 700 మందికి పైగా గాయపడ్డారు. నిందితులను అప్పట్లో పోలీసులు యూఏపీఏ కింద అరెస్ట్ చేశారు. పలు దఫాలుగా బెయిల్ ప్రయత్నాలు సాగించారు. ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

నిందితులు దాఖలు చేసిన ఈ బెయిల్ పిటీషన్లపై ఇదివరకే జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్ వీ అంజారియాతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు విచారణను ముగించింది. డిసెంబర్ 10వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా తుది తీర్పు వినిసించింది. ఈ కేసులో నిందితులు అయిదేళ్లకు పైగా అండర్‌ట్రైల్‌గా జైలులో ఉన్నారని పిటీషనర్ల తరఫు అడ్వొకేట్ వాదించారు. ఈ వాదనలతో బెంచ్ ఏకీభవించలేదు.
విచారణ ప్రారంభానికి ముందే నిందితులను దీర్ఘకాలం పాటు జైలులో ఉంచడం కంటే జాతీయ భద్రత, ప్రజా శాంతిభద్రతలను పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యమని బెంచ్ స్పష్టం చేసింది. మిగిలిన అయిదుమంది నిందితులు గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రెహమాన్, మహమ్మద్ సలీం ఖాన్, షాదాబ్ అహ్మద్‌లపై విచారణ కొనసాగించడం అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. వారికి బెయిల్ మంజూరు చేసింది. ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ మినహా మిగిలిన వారంతా ఇప్పుడు జైలు నుంచి విడుదల కానున్నారు.
ప్రతి నిందితుడి బెయిల్ పిటిషన్‌ను కూడా నిర్దుష్టంగా పరిశీలించడం అవసరమని బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ దశలో ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే బెయిల్ పై తుది తీర్పు ఇచ్చామని పేర్కొంది. అల్లర్ల కుట్ర ఆరోపణల్లో ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ కీలక, ప్రాథమిక పాత్రను ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాలు సూచిస్తున్నాయని ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేసింది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications