వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వాన్ని నడపడం కష్టంగా ఉంది: నితీష్ సంచలనం, ప్రశంసించిన మోడీ

ప్రభుత్వాన్ని నడపడం చాలా కష్టంగా ఉందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పదవికి రాజీనామా చేసిన అనంతరం వ్యాఖ్యానించారు. గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

పాట్నా: ప్రభుత్వాన్ని నడపడం చాలా కష్టంగా ఉందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పదవికి రాజీనామా చేసిన అనంతరం వ్యాఖ్యానించారు. గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

సంక్షోభం, లాలూ సవాల్: సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామాసంక్షోభం, లాలూ సవాల్: సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా

పని చేసే వాతావరణం లేదు

పని చేసే వాతావరణం లేదు

ఈ సందర్భంగా నితీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించానని చెప్పారు. తాను ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నించానని చెప్పారు. కొన్ని సంఘటన వల్ల తాను పని చేసే వాతావరణం కనిపించలేదన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

ఇలాంటప్పుడు ప్రభుత్వాన్ని నడపలేను

ఇలాంటప్పుడు ప్రభుత్వాన్ని నడపలేను

తాను ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ను రాజీనామా చేయమని అడగలేదని నితీష్ స్పష్టం చేశారు. ఆయనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని మాత్రమే అడిగానని చెప్పారు. కానీ అటు నుంచి స్పందన లేదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడపలేనని తేల్చి చెప్పారు. బీహార్ రాజకీయ ప్రయోజనాల కోసమే రాజీనామా చేశానని చెప్పారు. తేజస్వి నిజాయితీ నిరూపించుకోవాలన్నారు.

అందుకే రాజీనామా

అందుకే రాజీనామా

లాలూ కుటుంబంపై భూకుంభకోణాలు, మద్యం కుంభకోణాలు ఇలా ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీతో కలిసి ఉన్నన్ని రోజులు నితీష్‌కు క్లీన్ ఇమేజ్ ఉంది. కానీ లాలూతో జతకట్టిన రెండేళ్లకే.. లాలూ కుటుంబం కుంభకోణాల వల్ల నితీష్‌కు చెడ్డ పేరు వస్తోంది. ఈ కారణంగానే ఆయన అనూహ్య నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

నితీష్‌ను అభినందించిన మోడీ, సమర్థన

నితీష్‌ను అభినందించిన మోడీ, సమర్థన

లాలూ కుటుంబంపై వచ్చిన అవినీతి మరకలకు సమాధానాలు లేని నేపథ్యంలో నితీష్ కుమార్ రాజీనామా చేయడాన్ని ప్రధాని మోడీ ప్రశంసించారు. అవినీతిపై పోరాటంలో కలిసి వస్తున్నందుకు నితీష్‌ను అభినందించారు. దేశంలోని ప్రజలంతా ఈ రాజీనామాను హర్షిస్తున్నారని మోడీ ట్వీట్ చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడపలేదు,
ప్రభుత్వాన్ని నడపడం కష్టంగా ఉంది

రాజీనామా సమర్పించా
ఎన్నో సంక్షేం కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నించా,
కోన్ని సంఘటన వల్ల నేను పని చేసే వాతారవరణం సేదు
కనిపించడంలేదు,క అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా,
ఆరోపణలపై వవివరణ ఇవ్వాలని అడిగా

English summary
"Under the current situation it's not possible for me to continue with the government. I tried to find a solution. I had requested Lalu Yadav and Tejashwi to clear all the facts regarding the corruption charges. But nothing has happened," Nitish Kumar said after submitting resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X