తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Union Budget 2022: తెలుగు తనం ఉట్టిపడింది, పోచంపల్లి చీరలో నిర్మలమ్మ, సింపుల్ !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతామారమన్ మంగళవారం లోక్ సభలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంతో అంతుకు ముందే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్, ఆర్థిక బిల్లకు ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి లోక్ సభలో అడుగుపెట్టిన నిర్మలమ్మ అందరిని కట్టి పడేశారు. తెలుగింటి కోడలు నిర్మలమ్మ చేనేత కార్మికులు చేతితో నేచిన పోచంపల్లి పట్టు చీర కట్టుకుని లోక్ సభలో అడుగుపెట్టి అందరిని ఆకర్షించారు.

Recommended Video

Union Budget 2022: All You Need To Know About The Schedule | Oneindia Telugu

Khiladi: రూ. లక్షల్లో జీతాలు వస్తాయని ?, అమ్మాయిలను అమ్మేస్తున్న దంపతులు, ఐటీ హబ్ లో డీల్!Khiladi: రూ. లక్షల్లో జీతాలు వస్తాయని ?, అమ్మాయిలను అమ్మేస్తున్న దంపతులు, ఐటీ హబ్ లో డీల్!

 అర్బాటాలకు దూరంగా ఉంటున్న తెలుగింటి కోడలు

అర్బాటాలకు దూరంగా ఉంటున్న తెలుగింటి కోడలు

కేంద్ర మంత్రిగా ఉన్నత పదవిలో ఉన్న నిర్మలా సీతారామన్ ఎప్పుడు అర్బాటాలకు దూరంగా ఉంటారని ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు. సాదారణ మహిళలా ఎప్పుడు చిరునవ్వుతో దర్శనం ఇచ్చే నిర్మలమ్మ కేంద్ర మంత్రి వర్గంలో ఆమెకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

 తెలుగోడికి గర్వకారణం

తెలుగోడికి గర్వకారణం

ఎప్పుడు ఎలాంటి హంగులు, అర్బాటాలకు తావులేకుండా చాలా సింపుల్ గా ఉండే నిర్మలమ్మ మన తెలుగింటి కోడలు అని చెప్పుకోవడానికి ప్రతి ఒక్క తెలుగు వాడు గర్వంగా ఫీలౌతాడు. తమిళనాడులో జన్మించిన నిర్మలా సీతారామన్ తెలుగువాడైన పరకాల ప్రభాకర్ ను వివాహం చేసుకున్న తరువాత నిర్మలమ్మ తెలుగింటి కోడలు అయ్యారు.

 పాత సంప్రధాయాలకు చెక్

పాత సంప్రధాయాలకు చెక్

మంగళవారం చేనేత కార్మికులు పట్టుతో చేతిమగ్గంలో నేచిన పోచం పల్లి చీరతో నిర్మలా సీతారామన్ లోక్ సభలో అడుగు పెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022*23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈసారి కూడా కాగిత రహిత బడ్జెట్ ను సమర్పించిన నిర్మలా సీతారామన్ ఆమె ప్రత్యేకతను చాటుకున్నారు.

 సాధారణ మహిళ అని నిరూపించుకున్న నిర్మలమ్మ

సాధారణ మహిళ అని నిరూపించుకున్న నిర్మలమ్మ

కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి లోక్ సభలో అడుగుపెట్టిన నిర్మలమ్మ అందరిని కట్టి పడేశారు. తెలుగింటి కోడలు నిర్మలమ్మ చేనేత కార్మికులు నేచిన పోచం పల్లి చేనేత చీర కట్టుకుని లోక్ సభలో అడుగుపెట్టారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్నా ఎప్పుడు కాని నిర్మలా సీతారామన్ అలాంటి ఫీలింగ్ లేకుండా తాను ఓక సర్వసాధారమైన మహిళ అని నడుచుకున్నారు. ఏమైనా దక్షిణ భారత సాంప్రధాయాలకు కట్టుబడి ఉండే నిర్మలా సీతారామన్ ఈ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో పోచలం పల్లి చేనేత చీర కట్టుకుని దర్శనం ఇవ్వడంతో చేనేత కార్మికులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Union Budget 2022: Union Minister Nirmala Sitharaman ditches red chooses an orange Pochampally Handloom Saree.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X