Union Budget 2025: ఈసారి వస్త్రవ్యాపారులకు నిర్మలమ్మ ఊరట..!

మరో మూడు రోజుల్లో కేంద్రం సాధారణ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను రికార్డు స్ధాయిలో తొమ్మిదోసారి లోక్ సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇందులో పలు రంగాలకు ఈసారి ఊరట దక్కబోతోందన్న ప్రచారం జరుగుతోంది. దేశంలో ప్రస్తుతం ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతుండటం, జనం ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు ప్రకటిస్తారని తెలుస్తోంది.

ఇందులో వస్త్రవ్యాపార రంగానికి కూడా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. వీటిలో వస్త్రవ్యాపార రంగానికి ఊతమిచ్చేలా పలు నిర్ణయాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా బేసిక్ గార్మెంట్స్ ( సాధారణ వస్త్రాలు)పై జీఎస్టీ రేటును తగ్గించబోతున్నట్లు తెలుస్తోంది. వస్త్రవ్యాపారాలకు ఊతమిచ్చేలా ఈ నిర్ణయం తీసుకోనున్నారు.వస్త్రవ్యాపార రంగం ప్రస్తుతం సంక్షోభం ఎదుర్కొంటోంది. దీనిపై ఏకంగా 4.5 కోట్ల మంది ఆధారపడి ఉన్నారు. దేశీయంగా డిమాండ్ తగ్గడం, ముడిసరుకు ధరల్లో పెరుగుదల, అంతర్జాతీయంగా పెరుగుతున్న పోటీ సమస్యలుగా ఉన్నాయి.

Union Budget 2025 centre likely to lower GST rates on basic garments to make clothing affordable

ఈ నేపథ్యంలో గత దశాబ్దకాలంలో వస్త్ర కొనుగోళ్లపై జనం చేసే వ్యయం 6 శాతం నుంచి 4 శాతానికి తగ్గిపోయింది. దీంతో గత బడ్జెట్ లో కేంద్రం అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 974 కోట్లు ఎక్కువగా కేటాయింపులు చేసింది. దీంతో గతంలో ఇచ్చిన రూ.3443 కోట్ల నుంచి రూ.4417 కోట్లకు కేటాయింపులు పెరిగాయి. ఈసారి కూడా ఈ కేటాయింపులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి వస్త్రాల ఉత్పత్తి పెంపు, కొనుగోళ్ల పెంపు లక్ష్యంగా ఆర్థికమంత్రి పలు నిర్ణయాలు ప్రకటిస్తారని పరిశ్రమ ఆశిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+