బ్యాంకు డిపాజిటర్లకు రూ.5లక్షలు బీమా -90రోజుల మారటోరియంలోనూ వర్తింపు -కేంద్ర కేబినెట్ నిర్ణయాలివే
కరోనా మహమ్మారి వరుస వేవ్‌లు, తరచూ లాక్‌డౌన్ల కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి, ఆర్థిక రంగంలో అతి కీలకమైన బ్యాంకుల పరిస్థితి ఇబ్బందికరంగా మారిన ప్రస్తుత తరుణంలో ఊరట నిర్ణయాలు తీసుకుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బ్యాంకులకు చెందిన ఖాతాదారులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. వివరాలివి..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మారటోరియం విధించినా బ్యాంకు ఖాతాదారులకు కూడా డిపాజిట్ బీమా వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు డీఐసీజీసీ(డిపాజిట్ ఇన్స్యూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్) చట్ట సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అందుకు సంబంధించిన వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం మీడియాకు వెల్లడించారు.

డీఐసీజీసీ చట్ట సవరణతో డీఐసీజీఐ ద్వారా 98.3 శాతం ఖాతాదారులు లబ్ధి పొందుతారని అన్నారు. బ్యాంకులపై మారటోరియం విధించిన 90 రోజుల్లో ఖాతాదారులు తమ డిపాజిట్లపై రూ. 5లక్షల వరకు బీమా సౌకర్యం పొందొచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆర్బీఐ అనుబంధ సంస్థ అయిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) ద్వారా బ్యాంకు మారటోరియం క్రిందకు వచ్చిన 90 రోజుల్లోగా డిపాజిటర్లకు ఈ బీమా లభించనుంది. కస్టమర్లకు సకాలంలో అండగా నిలవడం కోసమే ఈ సవరణ చేసినట్లు మంత్రి తెలిపారు.
డీఐసీజీసీ ద్వారా అందించే బీమా మొత్తాన్ని రూ.లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచారు. అయితే ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం బ్యాంకు లైసెన్సు రద్దు చేసి, లిక్విడేషన్ చర్యలు ప్రారంభించిన తర్వాతే డీఐసీజీసీ నుంచి బీమా మొత్తాన్ని పొందేందుకు వీలుంటుంది. తాజాగా ఈ డీఐసీజీసీ చట్టాన్ని సవరించడంతో దివాలా అంచున ఉన్న బ్యాంకుల ఖాతాదారులు తమ నిధులను వెనక్కి తీసుకునేందుకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. బ్యాంకు నష్టాల్లో ఉండి.. సాధారణ కార్యకలాపాలపై ఆర్‌బీఐ తాత్కాలిక నిషేధం విధించినప్పుడు.. ఖాతాలు స్తంభింపజేసినప్పుడు.. రూ. 5లక్షల వరకు నిధులను బీమా ద్వారా పొందే వీలుంటుంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications