పార్లమెంటులో దుమారం: క్షమాపణ చెప్పిన మంత్రి నిరంజన్ జ్యోతి
న్యూఢిల్లీ: తాను చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సహాయం మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి దిగి రాక తప్పలేదు. ఆమె చేసిన వ్యాఖ్యలపై మంగళవారం పార్లమెంటులో తీవ్ర దుమారం చెలరేగింది. దీంతో ఆమె క్షమాపణ చెప్పారు. ఆమె వ్యాఖ్యలను ప్రతిపక్షాలు పార్లమెంటులో ప్రస్తావిస్తూ మంత్రిగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో ఆమె లోకసభలో క్షమాపణ చెప్పారు
తాను ఆ వ్యాఖ్యలు చేశానని అంగీకరిస్తున్నానని, అందుకు క్షమాపణ చెబుతున్నానని నిరంజన్ జ్యోతి అన్నారు. ఆమె వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో పార్లమెంటు ఉభయ సభలు కూడా కొద్దిసేపు వాయిదా పడ్డాయి. లోకసభ సమావేశం కాగానే తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలను కాంగ్రెసు సభ్యుడు మల్లికార్జున్ ఖర్గే స్పీకర్ సుమిత్రా మహాజన్ దృష్టికి తెచ్చారు. వాయిదా తీర్మానాలను తిరస్కరించినట్లు స్పీకర్ చెప్పారు. ఆ అంశాలను జీరో అవర్‌లో లేవనెత్తవచ్చునని ఆమె సూచించారు.
జ్యోతి చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవని, ఉద్ర్రిక్తతలను రెచ్చగొట్టాయని ఖర్గే చెప్పారు. ఈ సమయంలో నినాదాలు చేస్తూ కాంగ్రెసు, తృణమూల్ కాంగ్రెసు సభ్యులు పలువురు వెల్‌లోకి దూసుకెళ్లారు. జ్యోతితో పాటు గిరిజా సింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయని ప్రతిపక్షాలు విమర్శించాయి. గందరగోళం చెలరేగిన సమయంలో నిరంజన్ జ్యోతీ సభలో ఉన్నారు. గిరిజా సింగ్ మాత్రం కనిపించలేదు.

నిరంజన్ జ్యోతి చేసిన వ్యాఖ్య ఇది..
ఢిల్లీ శానససభ ఎన్నికల ప్రచారంలో కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అమర్యాకరమైన వ్యాఖ్యలు చేశారు. పైగా తన వ్యాఖ్యలను ఆమె సమర్థించుకున్నారు. ఆమె వ్యాఖ్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెసు పార్టీ డిమాండ్ చేసింది. అయితే, తాను తప్పేమీ మాట్లాడలేదని కేంద్ర మంత్రి అన్నారు. రాముడి సంతానం పాలన కావాలో, అక్రమ సంతానం పాలన కావాలో ఢిల్లీ ప్రజలు తేల్చుకోవాలని ఆమె అన్నారు.
తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాముడి విశ్వసించనివాళ్లపై, దేశ సమైక్యత విశ్వాసం లేనివారిపై మాత్రమే తాను వ్యాఖ్యలు చేశానని, దానికి మతపరమైన రంగు పులమాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. తాను వ్యక్తిని గానీ, కమ్యూనిటీని గానీ, పార్టీని గానీ ప్రస్తావించలేదని చెప్పారు.
రాముడి గురించి మాట్లాడడం తప్పా, రాముడి గురించి మాట్లాడితే మతవిషయం అవుతుందా అని ఆమె అడిగారు. సాధ్వీ నిరంజన్ జ్యోతి దూషణలకు సమాధానం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెసు నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అవినీతిని ప్రోత్సహిస్తున్నారని మంత్రి విమర్శించారు. సోనియా గాంధీ అల్లుడు అంత ధనవంతుడు ఎలా అయ్యారని ఆమె సోనియా రాబర్ట్ వాద్రా విషయంపై ప్రశ్నించారు. దేశంలోని పేదలను వాద్రా దోచుకున్నాడని ఆరోపించారు.
పశ్చిమ ఢిల్లీలోని శ్యాంనగర్‌లో ఓటర్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ నిరంజన్ జ్యోతి దూషణలకు దిగారు. తాము అవినీతికి పాల్పడబోమని, అవినీతిని సహించబోమని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతున్నారని ఆమె అన్నారు. ఈ దేశాన్ని, ప్రజలను దోచుకుంటున్నవారిని ఏమని పిలువాలని ఆమె అడిగారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications