హీరో సెంట్రల్ జైల్లో ఉన్నాడా ?, ఫైవ్ స్టార్ హోటల్ లో ఉన్నాడా ?, కేంద్ర మంత్రి

బెంగుళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో కొందరు ఖైదీల కోసం ఫైవ్ స్టార్ హోటల్ ను తలపించే సదుపాయాలు అందులో ఉన్నాయని, ఎంత డబ్బు ఇస్తే అంత సదుపాయాలు ఉన్నాయని, డబ్బు ఇచ్చి జైల్లో ఏదైనా కొనుక్కోవచ్చు అని ఇప్పుడు శ్యాండిల్ వుడ్ హీరో దర్శన్ విషయంలో నిజం చేశారని కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర పరిశ్రమల శాఖా మంత్రి హెచ్.డీ. కుమారస్వామి ఆరోపించారు.సోమవారం మండ్యలో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి కుమారస్వామి కర్ణాటక ప్రభుత్వం తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటక రాష్ట్రంలోని జైల్లో ఇలాంటి రాచమర్యాదలు, ఖైదీల మధ్య గందరగోళం కొత్త కాదని, ఇది గతం నుంచి కొనసాగుతోందని కేంద్ర మంత్రి కుమారస్వామి ఆరోపించారు. గతంలో సిద్దరామయ్య ప్రభుత్వంలోనే డీఐజీ, డీసీపీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని కేంద్ర మంత్రి కుమారస్వామి గుర్తు చేశారు. దీనిపై విచారణ జరపాలని అప్పట్లో ఉవ్విళ్లూరారని కుమారస్వామి గుర్తు చేశారు. బెంగళూరు పరప్ప అగ్రహార సెంట్రల్ జైలులో ఖైదీల కోసం ఫైవ్ స్టార్ హోటల్ సిస్టమ్ ఉందని, ఎంత డబ్బు పెడితే అంత లగ్జరీ లైఫ్ ఉంటుందని కేంద్ర మంత్రి హెచ్ డీ కుమారస్వామి ఆరోపించారు.

Union Minister Kumaraswamy made sensational comments regarding Hero Darshan

ఇప్పుడు కన్నడ హీరో దర్శన్ విషయంలో మరోసారి ఇలాంటి వ్యవహారం తెరపైకి వచ్చిందని, దర్శన్ తో పాటు జల్సాలు చేస్తున్న ఖైదీలను వేరే జైలుకు తరలించాలని కేంద్ర మంత్రి కుమారస్వామి డిమాండ్ చేశారు. సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మలేకపోతున్నారని కేంద్ర మంత్రి కుమారస్వామి ఆరోపించారు. కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వం పాలన అనేదిలేదని, వీధుల్లో సిద్దరామయ్య అవినీతి గురించి మాట్లాడే పనిలో ప్రజలు బిజీ అయిపోయారని కేంద్ర మంత్రి కుమారస్వామి ఆరోపించారు.

సిద్దరామయ్య ఆయన స్కామ్‌ లపై మాట్లాడేందుకు సమయం సరిపోవడం లేదని, డబ్బుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైనా కొనుక్కోవచ్చు అని ప్రజలు చర్చించుకుంటున్నారని కేంద్ర మంత్రి కుమారస్వామి కర్ణాటక ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో శ్యాండిల్ వుడ్ హీరో దర్శన్ అరెస్టు అయ్యి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+