అన్ పార్లమెంటరీ పదాలపై నిషేధం వివాదం-లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా క్లారిటీ-నిషేధం కాదు కానీ..
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తాజాగా ఓ వివాదం తలెత్తింది. ఈసారి పార్లమెంటు సమావేశాల్లో కొన్ని అన్ పార్లమెంటరీ పదాలు వాడకుండా కేంద్రం నిషేధం విధించినట్లు వార్తలొచ్చాయి. పార్లమెంటు సమావేశాల్లో చోటు చేసుకుంటున్న అవాంఛనీయ ఘటనల్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై ఇవాళ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా క్లారిటీ ఇచ్చారు.
కొన్ని పదాలను 'అన్‌పార్లమెంటరీ'గా పేర్కొంటూ లోక్‌సభ సెక్రటేరియట్ ఇవాళ ఓ బుక్‌లెట్ విడుదల చేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా.. సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించడానికి స్వేచ్ఛగా అవకాశం ఉందని, పార్లమెంటులో ఎటువంటి పదాలను నిషేధించలేదని స్పష్టం చేశారు. కొంతమంది పార్లమెంటు సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని పదాలను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

తొలగించిన పదాలను ప్రతిపక్షంతో పాటు అధికారంలో ఉన్న పార్టీ కూడా పార్లమెంటులో ఉపయోగించాయన్నారు. ప్రతిపక్షాలు మాత్రమే వాడే పదాలను సెలెక్టివ్‌గా తొలగించడం లాంటిది ఏమీ లేదన్నారు. అంతకుముందు, లోక్‌సభ సెక్రటేరియట్ 'జుమ్లజీవి', 'బాల్ బుద్ధి', 'కోవిడ్ స్ప్రెడర్' మరియు 'స్నూప్‌గేట్' వంటి పదాల వినియోగాన్ని పేర్కొంటూ ఒక బుక్‌లెట్‌ను విడుదల చేసింది. సాధారణంగా 'సిగ్గు', 'దుర్వినియోగం', 'ద్రోహం', 'వంటి పదాలను కూడా వాడరాదని తెలిపింది. అవినీతి', 'నాటకం', 'వంచన', 'అసమర్థత' లోక్‌సభ మరియు రాజ్యసభ రెండింటిలోనూ "అన్‌పార్లమెంటరీ"గా పేర్కొన్నారు. దీనిపై స్పీకర్ క్లారిటీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications