సీఎంపై దాడి చేసింది ఇతనే..: షాకింగ్ బ్యాక్ గ్రౌండ్

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగింది. ఆమె అధికారిక నివాసంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రజలతో ముఖాముఖి (Jan Sunwai) సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తం రేఖా గుప్తాపై దాడి చేసినట్లు ప్రాథమకంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచీ రేఖా గుప్తా ప్రతివారం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోన్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలో ఈ ఉదయం 9 గంటలకు ఆమె ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజలతో మాట్లాడారు. వారి నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు.

Unveiling the Truth The Attack on Delhi CM Rekha Gupta Exposed

అదే సమయంలో- 30 సంవత్సరాల వయసున్న ఓ వ్యక్తి దాడికి దిగాడు. తొలుత ఓ వినతిపత్రాన్ని రేఖా గుప్తాకు అందించారు. తన సమస్యలను చెప్పుకొన్నాడు. ఈ క్రమంలో, హఠాత్తుగా అతను రేఖా గుప్తాపై దాడి చేశాడు. ఆమె చెంపపై కొట్టాడు. జుట్టు పట్టుకుని లాగినట్లు కూడా తెలుస్తోంది.

ఈ అనూహ్య ఘటనతో ఉలిక్కిపడ్డ పోలీసులు.. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు. అతని వివరాల గురించి ఆరా తీస్తోన్నారు. అతన్ని తనిఖీ చేయగా.. కోర్టుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు లభించాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఈ ఘటనపై ఢిల్లీ సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వం ఆదేశించింది. పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని పేర్కొంది. ఈ దాడిలో ముఖ్యమంత్రికి తలకు గాయం అయిందని బీజేపీ వర్గాలు ఆరోపించాయి.

ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. అతని ఫొటోను మీడియాకు విడుదల చేశారు. అతని పేరు రాజేష్ భాయ్ ఖీమ్జీ భాయ్ సకారియా. గుజరాత్ లోని రాజ్ కోట్ కు చెందిన వ్యక్తి. అతని బంధువులలో ఒకరు జైలులో ఉన్నాడని, అతన్ని విడుదల చేయాలనే పిటిషన్‌తో అతను రేఖా గుప్తా నివాసానికి వచ్చినట్లు తెలిపారు.

వీధికుక్కలకు సంబంధించిన తీర్పు తర్వాత అతను రాజ్ కోట్ నుంచి ఢిల్లీకి వచ్చాడని, అతను జంతు ప్రేమికుడని గుజరాత్ మీడియా వెల్లడించింది. గతంలో కూడా పలుమార్లు ఢిల్లీకి ప్రయాణించినట్లు రాజేష్ భాయ్ తల్లిని ఉటంకిస్తూ ప్రత్యేక కథనాలు ప్రసారం చేశాయి. మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+