ఆ సమయంలో ప్రతి ఇంటికీ లక్ష్మీదేవి వచ్చిందంటే కారణం ప్రధాని మోదీ: అమిత్ షా
లక్నో : మరో వారంరోజుల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ వేడి రాజుకుంటోంది. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్‌లో అయితే వార్ నువ్వానేనా అన్నట్లుగా అధికార బీజేపీ ప్రతిపక్ష ఎస్పీల మధ్య సాగుతోంది. రెండు పార్టీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది పరిస్థితి. ఇక తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమాజ్‌వాదీ పార్టీపై నిప్పులు చెరిగారు. కరోనా సమయంలో కూడా ప్రతి ఇళ్లు సంతోషంగా ఉన్నిందంటే అందుకు కారణం ప్రధాని నరేంద్ర మోదీ కష్టమే అని కొనియాడారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని అత్రౌలీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అమిత్ షా. "కరోనా సమయంలో ప్రతి ఇళ్లు కూడా సంతోషంగా ఉన్నిందంటే అందుకు కారణం ప్రధాని మోదీ. కమలం పువ్వు పై కూర్చున్న లక్ష్మీదేవీ ప్రతీ ఇంటిని సందర్శించింది.ఇలా గత రెండేళ్లు సందర్శించింది. లక్ష్మీ దేవీ ప్రతీ ఇంటిని సందర్శించిందంటే అందుకు కారణం ప్రధాని మోదీ" అని అమిత్ షా అన్నారు. అభివృద్ధి అంటే బీజేపీతోనే సాధ్యమని చెప్పిన అమిత్ షా... సమాజ్ వాదీపార్టీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీలతో అది సాధ్యం కాదన్నారు. అఖిలేష్ కానీ మాయావతి కానీ గ్యాస్, టాయిలెట్స్, కరెంటు, గృహాలు ఇచ్చారా.. ఇవన్నీ ప్రధాని మోదీ నేతృత్వంలోనే జరిగాయని గుర్తుచేశారు.

అఖిలేష్ యాదవ్ వ్యాక్సిన్ పై బీజేపీని విమర్శిస్తున్నారని.. అందరికీ వ్యాక్సిన్ లభించిందా లేదా అని ప్రశ్నించారు అమిత్ షా.అందరికీ వ్యాక్సిన్ లభించిందనే విషయాన్ని గట్టిగా అఖిలేష్‌కు వినిపించేలా తెలియజేయాలని అమిత్ షా ఈ సందర్భంగా కోరారు. ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్‌లో రాజకీయ వేడి రంజుగా సాగుతోంది. అఖిలేష్ యాదవ్, శివపాల్ యాదవ్‌లు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థిని నిలపకూడదని డిసైడ్ అయ్యింది. మరో వైపు ఎస్పీ బీఎస్పీలు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక తొలి దశ ఎన్నికల నాటికి వర్చువల్ పద్ధతిలో 10 క్యాంపెయిన్లు నిర్వహించాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు.
Recommended Video
ఉత్తర్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు మొత్తం ఏడు విడతలుగా జరుగుతుండగా తొలి దశ ఎన్నికలు ఫిబ్రవరి 10వ తేదీన జరుగనున్నాయి. కౌంటింట్ మార్చి 10వ తేదీన జరుగుతుంది.












Click it and Unblock the Notifications