ఉత్తర ప్రదేశ్ బడ్జెట్: గోశాలల నిర్మాణం కోసం రూ.450 కోట్లు కేటాయింపు
ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగీ సర్కార్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. మొత్తం రూ. 4.79 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి రాజేష్ అగర్వాల్. ఇది గతేడాది బడ్జెట్‌కంటే 12శాతం అధికంగా ఉంది. గతేడాది బడ్జెట్ రూ. 4,28,384.52 లక్షల కోట్లుగా ఉన్నింది. ఇక బడ్జెట్ విశేషాలకొస్తే గోవులను సంరక్షించేందుకు కాను అధిక ప్రాధాన్యత ఇచ్చింది యూపీ సర్కార్. గోవుల సంరక్షణ కోసం గోశాలలను నిర్మించాలని భావించింది. ఇందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లోని గోశాల నిర్మాణం వాటి మెయింటెనెన్స్‌కు రూ. 247 కోట్లు కేటాయించిన ప్రభుత్వం కన్హ గోశాలల నిర్మాణం కోసం రూ. 200 కోట్లు కేటాయించింది.
ఇక తన బడ్జెట్ ప్రసంగంలో మంత్రి రాజేష్ అగర్వాల్ చాలా పథకాలను ప్రకటించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మద్యంపై ప్రత్యేక పన్ను విధానంను అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మథురాలో కొత్త డైరీ ఫామ్ ఏర్పాటుకోసం బడ్జెట్‌లో రూ.56 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక మహిళల కోసం కూడా మంచి పథకాలు ప్రవేశ పెట్టింది ప్రభుత్వం. కన్య సుమంగళ యోజన పథకానికి రూ.1200 కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా ఆడపిల్లల విద్యకు, వారి బంగారు భవిష్యత్తుకు ఖర్చు చేయనున్నారు.

ఇక ఆయుష్మాన్ భారత్ పథకం కోసం రూ.1298 కోట్లు కేటాయించడం జరిగింది. ప్రధాన్ మంత్రి మాత్ర వందన యోజన కింద రూ.291 కోట్లు కేటాయించారు. ముఖ్యమంత్రి జన్ ఆరోగ్య అభియాన్ పథకానికి రూ. 111 కోట్లు కేటాయించారు. స్వచ్ఛ్ భారత్ పథకం కోసం రూ. 6వేల కోట్లు కేటాయించింది యోగీ సర్కార్. ఇక రాష్ట్రంలో పెరిగిపోతున్న క్రైమ్ రేట్లపై దృష్టి సారించిన యోగీ ప్రభుత్వం పోలీస్ స్టేషన్లను పెంచడంతో పాటు కొత్త స్టేషన్ల నిర్మాణం కోసం రూ.700 కోట్లు కేటాయింపులు చేసింది. ఇక పోలీస్ స్టేషన్ల ఆధునికీకరణకోసం రూ. 200 కోట్లు కేటాయించింది.












Click it and Unblock the Notifications