మోడీజీ! బీహార్ గుర్తుందిగా..: బీజేపీకి యూపీలో షాక్ తప్పదా?
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసిస్తుందని, మేజిక్ ఫిగర్‌కు అటు ఇటుగా బీజేపీనే అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. దీనిని బీజేపీ స్వాగతించింది.
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసిస్తుందని, మేజిక్ ఫిగర్‌కు అటు ఇటుగా బీజేపీనే అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. దీనిని బీజేపీ స్వాగతించింది.
అయితే, ఎగ్జిట్ పోల్ సర్వేల ఫలితాలు, బీజేపీ ఆనందంపై ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ నీళ్లు చల్లారు! 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమయిందో ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలని రాహుల్ వ్యాఖ్యానించారు.
ఎగ్జిట్ పోల్ అంచనాలను ఆయన కొట్టి పారేశారు. యూపీలో కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీ కూటమి తప్పకుండా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యూపీలో విజయం మాదేనని, బీహార్ ఎన్నికల ఫలితాల సమయంలోనూ సర్వేలన్నీ బీజేపీకి విజయం తథ్యమని చెప్పాయని, కానీ ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తప్పు అయ్యాయన్నారు.

మార్చి 11న తాము మాట్లాడుతామన్నారు. ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఎటువంటి అభిప్రాయం చెప్పలేను అన్నారు. నవంబర్ 2015 బిహార్ ఎన్నికల ఫలితాల సమయంలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని పలు పోల్స్ ఫలితాలు చెప్పాయి. కానీ రాష్ట్రంలో మహాకూటమి గెలుపొందింది. ఇప్పుడు కూడా బీహార్ వలె ఎగ్జిట్ పోల్ ఫలితాలు తారుమారు అవుతాయని కాంగ్రెస్ చెబుతోంది.
తప్పుబట్టిన పార్టీలు
ఎగ్జిట్ పోల్స్ పేరుతో వదంతులు ప్రచారం చేయడం ప్రజాస్వామ్యాన్ని పరిహరించడమేనంటూ పలు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు సంధించాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతుండటాన్ని పలు పార్టీలు తప్పుపట్టాయి.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications