కుటుంబమే లేని ఫకీర్లకు ప్రజల బాధ ఏం తెలుస్తుంది: మోడీపై అఖిలేష్ యాదవ్ ఎదురుదాడి
ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో సమాజ్‌వాదీ పార్టీ ని "నకిలీ సమాజ్‌వాద్" అని ఆరోపిస్తూ, కుటుంబ పార్టీ అని పేర్కొన్నారు. ఇక దీనిపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ గురువారం టార్గెట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వాన్ని ప్రజలు నడుపుతున్నారా చెప్పాలి అంటూ అని మండిపడ్డారు. కుటుంబం లేనివారికి ఇతరుల బాధ అర్థం కాదని చురకలంటించారు. 2017 ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఆరోపించారు.

కుటుంబం ఉన్నవారే ప్రజల బాధ అర్ధం చేసుకోగలరు
కుటుంబం ఉన్నవారే కుటుంబం పడే బాధను అర్థం చేసుకోగలరని, కుటుంబం లేని వారికి అర్థం కాదని చెప్పాలనుకుంటున్నాను అంటూ ఎదురు దాడి చేశారు అఖిలేష్ యాదవ్ .ఐదేళ్లుగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిన బీజేపీ తమ చివరి మేనిఫెస్టో కోసం రెండు నిమిషాలు మౌనం పాటించాలని అన్నారు. తాము కుటుంబాలు కలిగి ఉన్నందుకు గర్వపడుతున్నాము, కుటుంబ వ్యక్తి జోలా (బ్యాగ్) తో పారిపోడని, కుటుంబాన్ని విడిచిపెట్టడు అని పేర్కొన్నారు.

కుటుంబం ఉంటే కరోనా సమయంలో వలసకూలీల బాధ తెలిసేది
లాక్‌డౌన్ సమయంలో, ముఖ్యమంత్రికి కుటుంబం ఉంటే, కూలీలు మైళ్ల దూరం నడిచిన బాధను అర్థం చేసుకునే వారన్నారు. అఖిలేష్ యాదవ్ ఫకీర్లు ఏదో ఒక రోజు చంకన జోలె తగిలించుకుని వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. "డబుల్ ఇంజిన్" నినాదంపై బిజెపిపై విరుచుకుపడిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ , గురువారం ప్రారంభమైన కీలకమైన ఎన్నికలు రాజ్యాంగాన్ని మరియు ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అని అన్నారు.

డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే రెట్టింపు అవినీతి
యోగి ప్రభుత్వ హయాంలో అవినీతి అంతమైందా.. అని ప్రశ్నించారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే రెట్టింపు అవినీతి అని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు . తొలి దశ పోలింగ్ సందర్భంగా పలు బూత్‌లలో ఈవీఎంలు సరిగా పనిచేయడం లేదన్న నివేదికలపై ఎస్పీ చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈవీఎంలు సక్రమంగా పనిచేయడం లేదని, గంటల తరబడి ఓటింగ్‌ను నిలిపివేస్తే ఓట్లు వేయడానికి ప్రజలు నిరీక్షించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఓటింగ్ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఎన్నికలకు సన్నాహాలు చేసి ఉండాల్సిందని అఖిలేష్ యాదవ్ వెల్లడించారు.

ఆశిష్ మిశ్రాకు బెయిల్ పై అఖిలేష్ స్పందన
లఖింపూర్ ఖేరీ హింసాకాండలో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై అఖిలేష్ యాదవ్ స్పందించారు. ప్రభుత్వం కఠినంగా శిక్షించవలసి ఉంది, కానీ అది విఫలమైంది అని పేర్కొన్నారు. లఖింపూర్ ఖేరీలో జరిగిన సంఘటనను ప్రపంచం చూసింది. రైతుల చావుకు బిజెపి కారణం అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications