వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ బలంగా ఉండాలంటే బీజేపీకి ఓటేయంండి-యూపీ ప్రచారంలో మోడీ

|
Google Oneindia TeluguNews

అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్న వేళ భారత్ బలంగా ఉండాలంటే బీజేపీకే ఓటు వేయాలని యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ ఓటర్లను కోరారు. ఇవాళ ఆరో దశ ఎన్నికలు జరుగుతన్న వేళ.. ఏడో దశ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రధాని మోడీ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రధాని మోడీ ప్రత్యర్ది సమాజ్ వాదీ పార్టీపై విరుచుకుపడ్డారు. మాఫియా పార్టీలు, వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలతో యూపీకి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. పరివార్ వాదీ పార్టీలు (సమాజ్ వాదీ) మాపియాతో తమ పాత బంధాల్ని వదులుకోలేకపోతున్నాయని మోడీ ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్ ప్రజలతో బీజేపీకి పొత్తు ఉందని, చందౌలీకి చెందిన 14 వేల పేద కుటుంబాలతో తమ కూటమి అండగా ఉందన్నారు., వారి కలలను నెరవేర్చడానికి తాము రాత్రింబవళ్లు కష్టపడ్డామని ప్రధాని మోడీ తెలిపారు.

UP Elections 2022 : pm modi urge vote for bjp to make india strong amid world challenges

ప్రస్తుతం భారత్ అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందని రష్యా, ఉక్రెయిన్ పోరును పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రధాని మోడీ తెలిపారు. ఇలాంటి సమయంలో భారత్ పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కాబట్టి భారత్ ను బలోపేతం చేయాలంటే బీజేపీకి ఓటేయాలని మోడీ ఓటర్లను కోరారు. ఉత్తర్ ప్రదేశ్ చివరి దశ ఎన్నికల ప్రచారంలో బీజేపీకి ఆధిక్యం కోసం ప్రధాని మోడీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా యూపీలోని ఏడో దశ ఎన్నికలు జరిగే పలు ప్రాంతాల్లో సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. యూపీలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. యోగీ ఆదిత్యనాథ్ సారధ్యంలో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని ఆశాభావంగా ఉన్నారు.

English summary
pm modi on today urged vote for bjp in uttar pradesh elections and said that amid international challenges india should be strong in the leadership of bjp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X