వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

UP Elections 2022: ఐదో విడతలో క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు ఎంతమంది ఉన్నారంటే!!

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్లో దశలవారీగా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీగా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. అధికారం కోసం బీజేపీ, బీజేపీని గద్దె దించడం కోసం ప్రతిపక్షాలు పడరాని పాట్లు పడుతున్నాయి. యూపీలో ఎన్నికల ప్రచారంలో మాటల దాడులకు దిగుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో ఐదవ దశ ఎన్నికల సందర్భంగా పోలింగ్ జరగనున్న 60 శాతానికి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నట్లు ఒక నివేదిక తెలిపింది. అలాగే, పోటీలో ఉన్న 685 మంది అభ్యర్థుల్లో 185 మంది అంటే 27 శాతం మంది తమపై క్రిమినల్ కేసులను ప్రకటించగా, 141 మంది అంటే 21 శాతం మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు అంగీకరించారని ఏడిఆర్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక పేర్కొంది.

అమేథీ, అయోధ్య, బహ్రైచ్, బారాబంకి, చిత్రకూట్, గోండా, కౌశాంబి, ప్రతాప్‌గఢ్, ప్రయాగ్‌రాజ్, శ్రావస్తి మరియు సుల్తాన్‌పూర్‌లోని 11 జిల్లాల్లోని 60 అసెంబ్లీ స్థానాలకు ఐదవ దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 23న ఓటింగ్ జరిగిన రాయ్ బరేలీ జిల్లాలో ఒక స్థానానికి కూడా ఈ దశలోనే పోలింగ్ జరుగుతుంది.ఎన్నికల్లో పోటీ చేస్తున్న 693 మంది అభ్యర్థుల్లో 685 మంది స్వీయ ప్రమాణ పత్రాల విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు ఏడీఆర్ తెలిపింది. ఎనిమిది మంది అభ్యర్థుల అఫిడవిట్‌లు అసంపూర్తిగా ఉన్నందున వాటిని విశ్లేషించలేదని పేర్కొంది.

UP Elections fifth phase: Criminal cases against candidates contesting in more than 60 per cent of Assembly constituencies

ఎన్నికలు జరగనున్న 61 స్థానాల్లో 39 స్థానాలు మొత్తం 64 శాతం "రెడ్ అలర్ట్ నియోజకవర్గాలు" అని నివేదిక పేర్కొంది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పోటీలో ఉన్న అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదు అయి ఉన్న నియోజకవర్గాలను రెడ్ అలర్ట్ నియోజకవర్గాలు అంటారు. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ప్రకటించిన 12మంది అభ్యర్థులు ఉన్నారు.

వారిలో ఒక పోటీదారుడు అత్యాచారానికి సంబంధించిన కేసును (IPC సెక్షన్-376) ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు అని నివేదిక వెల్లడించింది. ఎనిమిది మంది అభ్యర్థులు తమపై హత్య (ఐపీసీ సెక్షన్-302) కేసులు ఉన్నట్టుగా పేర్కొనగా, 31 మందిపై హత్యాయత్నం (ఐపీసీ సెక్షన్-307) ఆరోపణలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో దశలవారీగా జరుగుతున్న ఎన్నికలలో ప్రతి దశలోనూ క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల డేటాను ఏడిఆర్ విశ్లేషించింది.

English summary
The ADR analysis said there were criminal cases against three or more candidates contesting in more than 60 per cent of the Assembly constituencies during the fifth phase of elections in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X