మరో దారుణం: పొలాల్లోకి తీసుకెళ్లి యువతి గ్యాంగ్ రేప్

ఈ దారుణ సంఘటన గత రాత్రి జరిగింది. రోడ్డు పైన వెళ్తున్న పదిహేడేళ్ల బాలికను నలుగురు యువకులు పట్టుకొని, ఆమెపై దగ్గర్లోని పొలాల్లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ తర్వాత వారు అక్కడి నుండి పారిపోయారని పోలీసులు చెప్పారు.
నిందితులను గుర్తించినట్లుగా పోలీసులు చెప్పారు. నిందితులు ముఖేష్, అరవింద్, విక్రమ్, దుర్గేష్‍లు అన్నారు. సంఘటన అనంతరం నలుగురు కూడా పారిపోయారన్నారు.
ఈ సంఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. నిందితుల కోసం తాము గాలిస్తున్నామన్నారు. కాగా, ఇద్దరు దళిత యువతులను అత్యాచారం చేసిన సంఘటన తర్వాత ఈ ఘటన వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications