యూపీలో ఇంటికి నిప్పంటించిన దారుణం.. జర్నలిస్ట్ తోపాటు అతని స్నేహితుడు సజీవదహనం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని ఆగంతకులు ఓ జర్నలిస్ట్ ఉన్న ఇంటికి నిప్పంటించిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో జర్నలిస్టు సజీవదహనమయ్యారు. బలరాంపూర్ పట్టణంలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనలో స్థానిక జర్నలిస్టు రాకేష్ సింగ్ నిర్భీక్ , తన స్నేహితుడితో కలిసి ఉంటున్నాడు. దుండగులు ఆయన ఇంటికి నిప్పంటించగా ఈ ఘటనలో జర్నలిస్టు రాకేష్ సింగ్ తో పాటు అతని స్నేహితుడు సజీవదహనమయ్యారు.
గుర్తు తెలియని ఆగంతకులు చేసిన దారుణ ఘటనలో వారిరువురూ ప్రాణాలు కోల్పోయారు. స్థానిక జర్నలిస్ట్ రాకేశ్ సింగ్ నిర్భీక్ మరియు అతని స్నేహితుడిని సజీవదహనం చేసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సంఘటన జరిగిన సమయంలో జర్నలిస్ట్ భార్య, పిల్లలు బంధువుల ఇంట్లో లేరని, వారు బంధువుల ఇంటికి వెళ్లినట్టు తెలుస్తుంది . పోలీసులు మాట్లాడుతూ, నాలుగు పోలీసు బృందాలు దర్యాప్తుకు పని చేస్తున్నాయని చెప్పారు. నిందితులను పట్టుకుంటామని, అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు.

Recommended Video
అసలు వాళ్ళు ఈ ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డారు. జర్నలిస్ట్ కు వారికి మధ్య ఉన్న వివాదం ఏంటి ? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . సంఘటనా స్థలం నుండి ఆధారాలను సేకరిస్తున్నామని చెప్పారు పోలీసులు . మరణించిన జర్నలిస్ట్ భార్యకు జిల్లా యంత్రాంగం ఆర్థిక సహాయంగా రూ .5 లక్షల చెక్కు ఇచ్చింది. బలరాం పూర్ షుగర్ మిల్లు మేనేజ్‌మెంట్ ఆమెకు ఉద్యోగం ఇస్తుందని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications