జర్నలిస్ట్ హత్య: మంత్రి మీద కేసు నమోదు
లక్నో: జర్నలిస్ట్ ను సజీవదహనం చేసిన కేసులో ఉత్తరప్రదేశ్ మంత్రి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వెనుక బడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి రాంమూర్తి సింగ్ వర్మతో పాటు ఐదుగురి మీద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
షాజహాన్ పూర్ లో జగేంద్ర సింగ్ అలియాస్ జితేంద్ర సింగ్ నివాసం ఉంటున్నారు. ఈయన జర్నలిస్ట్ గా పని చేస్తున్నారు. మంత్రి రాంమూర్తి సింగ్ వర్మ అక్రమ మైనింగ్ కార్యకలాపాలు చేస్తున్నారని జగేంద్ర వార్తలు వ్రాశారు.

తరువాత ఆ వార్తల క్లిప్పింగ్ లు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఈ విషయంపై రాంమూర్తి సింగ్ వర్మ అనుచరులు కక్ష పెంచుకున్నారు. జూన్ 1వ తేదిన జగేంద్ర సింగ్ ను పట్టుకున్న నిందితులు అతని మీద దాడి చేసి నిప్పంటించారు.
తీవ్రగాయాలైన జగేంద్రను ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో జగేంద్ర వాంగ్మూలం ఇచ్చాడు. మంత్రి రాంమూర్తి అనుచరులు తన మీద పెట్రోల్ పోసి నిప్పంటించారని ఫిర్యాదు చేశాడు. జగేంద్ర కుమారుడు ఫిర్యాదు చెయ్యడంతో మంత్రి రాంమూర్తి సింగ్ తో పాటు ఐదు మంది మీద సెక్షన్ 302, 120, 504,505 కింద కేసులు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications