వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగిపై పోటీకి చంద్రశేఖర్ అజాద్ రెడీ.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనంటూ సవాల్

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న కొద్ది రసవత్తరంగా మారుతున్నాయి. వ్యూహా ప్రతి వ్యూహాలతో పార్టీలన్నీ దూసుకుపోతున్నాయి. ఒక పార్టీలో నుంచి మరో పార్టీలోకి నేతలు జంప్ చేస్తూ కాక పుట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తొలిసారిగా గోరఖ్ పూర్‌లోని సాదర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఆయనపై పోటీకి భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ రంగంలోకి దిగుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. యోగిని అసెంబ్లీలో అడుగు పెట్ట‌నివ్వ‌ని సవాల్ విసిరారు.

 సాద‌ర్ నుంచి బ‌రిలో యోగి

సాద‌ర్ నుంచి బ‌రిలో యోగి


గోరఖ్‌పూర్ పార్లమెంటు స్థానం నుంచి యోగి ఆదిత్యనాథ్ ఐదుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఇది యోగికి కంచుకోట. అయితే ఇదే పార్లమెంటు నియోజక వర్గం పరిధిలోని సాదర్ స్థానం నుంచి తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేయ‌నున్నారు యోగి. ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తాను కూడా సాదర్ నుంచి యోగిపై పోటీకి దిగుతున్నట్లు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ప్రకటించారు. ఆజాద్ కూడా తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు.

యోగిని అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వ‌ను..

యోగిని అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వ‌ను..

బీజేపీ ప్రభుత్వం వల్లే తాను జైలుకు వెళ్లాల్సి వచ్చిందని చంద్రశేఖర్ ఆజాద్ నిప్పులు చెరిగారు. గడిచిన ఐదేళ్లలో జైల్లో ఉన్న ఏకైక రాజకీయ నేతను తానేన‌ని మండిపడ్డారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని సవాల్ విసిరారు. అందుకే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో యోగికి వ్యతిరేకంగా బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు. మొదటి సారి జైలుకు వెళ్లినప్పటి నుంచే బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు పని చేస్తానని చెప్పారు.

బీజేపీ కంచుకోట సాద‌ర్‌

బీజేపీ కంచుకోట సాద‌ర్‌

యూపీలోని గోరఖ్‌పూర్‌లోని సదర్ అసెంబ్లీ నియోజవర్గంలో 1989 నుంచి బీజేపీ విజయం సాదిస్తోంది. 2017 లో అగ్రకులాలకు, దళితులకు మధ్య చోటుచేసుకున్న సమయంలోనూ బీజేపీ అభ్యర్థి రాధా మోహన్ దాస్ అగర్వాల్ భారీ మెజార్టీతో గెలుపొందారు. సమాజ్ వాదీ పార్టీలో సీట్ల సర్ధుబాటు కుదరకపోవడంతో అఖిలేష్ యాదవ్‌లో జత కట్టలేదని చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. తమకు 25 సీట్లు కేటాయిస్తామని చెప్పి మోసం చేసిందని ఆరోపణలు గుప్పించారు. భీమ్ ఆర్మీ పార్టీ తరుపున 2019లో వారణాసి పార్లమెంటు స్థానం నుంచి నరేంద్ర మోదీపై చంద్రశేఖర్ ఆజాద్ పోటీ చేసి ఓటమిని చవిచూశారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో యోగిపై పోటీకి ఆజాద్ సిద్దమయ్యారు.

English summary
Bheem Army Chief Chandrashekar Azad Contest against CM Yogi Adityanath
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X