UP Polls 2022: నిరుద్యోగుల చేతిలో యోగీ ఉద్యోగం: మోదీ చరిష్మా గట్టెక్కించేనా..!!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం రోజున ఉత్తర్ ప్రదేశ్‌లో తొలి విడత పోలింగ్ ముగిసింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రాష్ట్ర ఎన్నికల ఫలితాల మీదే కేంద్రంలో ప్రభుత్వాలు మనుగడ సాధిస్తాయా లేదా అనేది దాదాపుగా ఒక క్లారిటీ వస్తుంది. ఇక ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ఎంతో కీలకంగా మారుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర జనాభా బ్రెజిల్ దేశ జనాభా కంటే ఎక్కువగా ఉంటుంది.

అంతేకాదు ఈ రాష్ట్రానికి ఘనమైన చరిత్రతో పాటు ఆధ్యాత్మిక రాష్ట్రంగా కూడా వెలుగొందుతోంది. చాలామంది దేశ ప్రధానులు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహించినవారు కావడం విశేషం. మోదీ కూడా వారణాసిలో గెలిచి దేశ ప్రధాని అయ్యారు. ఉత్తర్ ప్రదేశ్‌ నుంచి 80 మంది ఎంపీలు లోక్‌సభలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడ ఓటర్లు ఇచ్చే కీలక తీర్పు పైనే భారత రాజకీయాలు ఆధారపడి ఉంటాయని విశ్లేషకులు సైతం చెబుతుంటారు.

 మోదీ ఇమేజ్..

మోదీ ఇమేజ్..

గత ఐదేళ్లుగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం పాలన సాగిస్తోంది. అంతేకాదు ప్రధాని మోదీ కూడా ఈ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఆయన కూడా భారీ మెజార్టీతో ఇక్కడ నుంచి రెండు సార్లు గెలిచారు. ఈ సారి మాత్రం మోదీ పాపులారిటీకి ఈ అసెంబ్లీ ఎన్నికలు పరీక్షే అని చెబుతున్నారు విశ్లేషకులు. బీజేపీ ఓటమి పాలైతే ఒక లెక్క... ఒకవేళ అత్యల్ప మెజార్టీతో బయటపడ్డా మోదీ పాపులారిటీ తగ్గిందనే భావించాల్సి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అంతేకాదు ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో మోదీ ఇమేజ్ రాజకీయ అస్త్రంగా మారింది. ఇదిలా ఉంటే సరిగ్గా ఎన్నికలు జరిగే సమయంలోనే కొన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు, మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని చేసే ప్రసంగాలతో యూపీ ఎటువైపు మరులుతుందా అనేది సస్పెన్స్‌గా మారింది. ఇక ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉంది. ఐదేళ్లలో ఆశించిన స్థాయిలో ఉత్తర్ ప్రదేశ్ ఆర్థికాభివృద్ధి కనిపించలేదనే వాదన ఉంది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పరంగా ఉత్తర్ ప్రదేశ్ తలసరి ఆదాయం జింబాబ్వే కంటే తక్కువగా ఉంది. మరోలా చెప్పాలంటే హైతీ కంటే స్వల్పంగా ఎక్కువగా ఉంది.

యూపీలో నిరుద్యోగ సమస్య

యూపీలో నిరుద్యోగ సమస్య

నిరుద్యోగ సమస్య ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని పీడిస్తోంది. ఇక చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా పెద్ద చదువులు చదివిని వారు అప్లయ్ చేస్తున్నారంటే అక్కడ నిరుద్యోగ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ రైల్వేస్‌లో 35వేల క్లాస్ ఫోర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా 12 మిలియన్ అప్లికేషన్‌లు వచ్చాయి. ఇందులో చాలా మంది అభ్యర్థులు ఇంజినీరింగ్‌లాంటి పెద్ద కోర్సులు పూర్తి చేసినవారు ఉండటం విశేషం. దశాబ్దం క్రితం బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోదీ బరిలో దిగినప్పుడు ఉత్తర్ ప్రదేశ్‌ను గుజరాత్‌లా తీర్చి దిద్దుతానంటూ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఉత్తర్ ప్రదేశ్ రహదారులను హైవేలుగా తీర్చిదిద్దారు.

అదే సమయంలో మానవవనరుల రంగాన్ని కూడా అభివృద్ధి చేశారు. అయితే గుజరాత్‌లో కంపెనీలు వచ్చినట్లుగా వస్తాయని భావించినప్పటికీ పారిశ్రామికవేత్తలు యూపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదు. దీంతో అక్కడ ఉద్యోగ కల్పన అనేది కష్టతరంగా మారింది. సాధారణంగా సముద్ర తీరప్రాంతం కలిగి ఉన్న రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి.

 ఇన్వెస్టర్లకు లేని ఆసక్తి

ఇన్వెస్టర్లకు లేని ఆసక్తి

వీటితో పాటు ఉత్తర్ ప్రదేశ్‌లో మరిన్ని సమస్యలున్నాయి. పాలన, శాంతి భద్రతలు ఇంకా బలహీనంగానే ఉన్నాయి. ఇవన్నీ సమస్యలు పరిష్కారమైనప్పటికీ ఇన్వెస్టర్లు యూపీవైపు మొగ్గు చూపుతారా అనేది కూడా అనుమానమే. అందుకే ఉద్యోగాలు లేవు. దీంతో చాలామంది ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. వచ్చే ప్రభుత్వాలు ఉత్తర్ ప్రదేశ్‌లో ఉపాధి కల్పించడం ద్వారా వలసలను అరికట్టాలి. ఇందుకు ప్రభుత్వ రంగ సంస్థలను విస్తరించాలి.

అదే సమయంలో కొత్త ఎయిర్‌పోర్టులను నిర్మించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వందేళ్లుగా ఉత్తర్ ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన చరిత్ర చూస్తే అప్పుడు ఎలా ఉందో... ఇప్పుడు కూడా ఏమాత్రం మార్పులేదు. ఎంతో మంది ప్రధానులుగా ఉత్తర్ ప్రదేశ్‌ నుంచి అయ్యారు. కానీ ఎవరూ ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యను తీర్చలేకపోయారు. మొత్తానికి యోగీ ఉద్యోగం ఉండాలంటే నిరుద్యోగుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. అదే సమయంలో మోదీ ఛరిష్మా ఏమేరకు గట్టెక్కిస్తుందో వేచి చూడాలి. ఈ సారైన వచ్చే కొత్త ప్రభుత్వం ఈ నిరుద్యోగ సమస్యకు చెక్ పెడుతుందో లేదో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+