వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

25000 హోంగార్డ్స్‌ను తొలగించిన యూపీ...!

|
Google Oneindia TeluguNews

దేశ ఆర్ధిక సంక్షోభం ప్రభావం యూపీ రాష్ట్ర ప్రభుత్వంపై చూపుతోంది. సరైన నిధులు లేవనే కారణంతో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద విధులు నిర్వహించే 25000 మంది తాత్కాలిక హోంగార్డులను తోలంగిస్తూ... నిర్ణయం తీసుకుంది. రానున్న దీపావళీ నుండి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. మరోవైపు రాష్ట్రంలో పనిచేస్తున్న మరో 99వేల మంది హోంగార్డులకు కూడ నెలలో సగం రోజులే పనిదినాలను కల్పించనున్నారు.

ప్రధానంగా హోంగార్డులకు రోజువారిగా ఇచ్చే జీతాభత్యాలు, ఇతర అలవెన్స్‌లు కానిస్టేబుల్స్‌తో సమానంగా పెంచాలని ఇటివల సుప్రిం కోర్టు ఆదేశాలు జారీ చేసిందని, దీంతో రాష్ట్రప్రభుత్వంపై అధిక భారం పడుతోందని రాష్ట్ర అధికారులు తెలిపారు. దీంతో దీపావళీ ముందే, ఇలాంటీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. కాగా తొలగించిన 25000 మంది హోంగార్డులను కూడ సంవత్సరం క్రితమే విధుల్లోకి తీసుకోవడం విశేషం.

UP state government have decided to remove 25000 Home Guards

ఇక సుప్రిం కోర్టు ఆదేశాలకు సంబంధించి ఈ నెల 11నే యూపి పోలీసు విభాగం నిర్ణయం తీసుకుంది. అనంతరం ఉత్తర్వులు కూడ జారీ చేసింది. కాగా ప్రస్తుతం హోంగార్డుకు డైలీ అలవెన్స్ క్రింద 500 రూపాయలను ఇస్తుండగా సుప్రిం ఆదేశాలతో 672 రూపాయలు చెల్లించాల్సి ఉంది. దీంతో ప్రభుత్వం హోంగార్డులను పూర్తిగా తొలంగించాలని నిర్ణయం తీసుకుంది. కాగా హోంగార్డులకు ఎలాంటీ నెలవారి జీతాలకు లేకుండా రోజువారి పద్దతిన విధుల్లోకి తీసుకుంది. ఇక మిగిలిన హోంగార్డులకు కూడ సగం పనిదినాలనే కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఇస్తున్న 25 పనిదినాలకు గాను 15 రోజులే విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

English summary
Uttar Pradesh state government have decided to remove 25000 Home Guards from their postings at police stations and traffic signals citing budget constraints.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X