దారుణం: బహిర్భుమికి వెళుతున్న అక్కాచెల్లెళ్లను.. పొదల్లోకి లాక్కెళ్లి...

ఉత్తర్‌ ప్రదేశ్‌లో బాలికలు, మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా మరో దారుణం వెలగుచూసింది.

షహజన్‌పూర్‌: ఉత్తర్‌ ప్రదేశ్‌లో బాలికలు, మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా మరో దారుణం వెలగుచూసింది. బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు అక్కాచెల్లెళ్లపై గుర్తుతెలియని ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ సంఘటన షహజన్‌పూర్‌ జిల్లాలోని బన్నునగరియా గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకోగా గురువారం పోలీసుల ద్వారా వెలుగులోకి వచ్చింది. 17, 15 సంవత్సరాల వయసున్న గ్రామానికి చెందిన మైనర్‌ బాలికలు మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గ్రామ శివారులో బహిర్భుమికి బయలుదేరారు.

UP: Two teenaged minor sisters allegedly gangraped, beaten by three men in Shahjahanpur

అదే సమయంలో గుర్తుతెలియని ముగ్గురు దుండగులు వారిని అడ్గగించి బలవంతంగా వారిని పొదల్లోకి లాక్కెళ్లారు. బాలికలిద్దరూ వారిని ప్రతిఘటించడానికి యత్నించగా.. దుండగులు వారిని తీవ్రంగా కొట్టారు.

అనంతరం వారిపై సాముహిక అత్యాచారానికి పాల్పడి వారిని అక్కడే వదిలి పరారయ్యారు. కాసేపటికి ఇంటికి చేరిన బాధితులు జరిగిన ఘాతుకంపై తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దుండగుల దాడిలో ఓ బాలికకు తీవ్ర గాయాలయ్యాయని మద్నాపూర్‌ ఎస్‌హెచ్‌వో ఓం ప్రకాశ్‌ గౌతం తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+