మరో కేరళగా యూపీ: ఆలోచించి ఓటు వేయండి, యోగి ఆదిత్యనాథ్ పిలుపు
ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ఫేజ్ ఎన్నిక జరుగుతుంది. తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు ఉత్సాహం కనబరుస్తున్నారు. అయితే పోలింగ్ డే రోజున కూడా నేతలు పోనియడం లేదు. అటు ఇటుగా ఉన్న ఓట్లను సైతం తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఓటు వేసి.. భయం పారద్రోలాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారో లేదో.. యూపీ సీఎం యోగీ కూడా అలానే కామెంట్ చేశారు.
రాష్ట్రాన్ని మరో కశ్మీర్, కేరళ.. లేదంటే బెంగాల్ చేయొద్దు అని యోగి కోరారు. మీరు తప్పు చేస్తే రాష్ట్రం రావాణ కాష్టం అవుతుందని పరోక్షంగా ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆయన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో నిడివి 6 నిమిషాలు ఉంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంకితభావంతో పనిచేసిందని.. చేస్తోందని కామెంట్ చేశారు. గత ఐదేళ్లలో చాలా అద్భుతాలు జరిగాయని గుర్తుచేశారు.

మరోసారి ఆలోచించుకోవాలని.. లేదంటే రాష్ట్రం కేరళగా మారొచ్చు అని కామెంట్ చేశారు. కార్మికులకు ఉపాధి కల్పించామని... అన్నీ రంగాల్లో రాష్ట్రం అభివృద్ది పథంలో కొనసాగుతుందని వివరించారు.గత ఐదేళ్లలో తాను చేసిన పనులు మీ ఆశీర్వాదం అని ఆయన అన్నారు. మీరు వేసే ఓటు నిర్భయంగా ఉండేందుకు గ్యారంటీ వంటిదని కామెంట్ చేశారు.
తొలివిడతలో మొత్తం 11 జిల్లాల్లో గల 58 నియోజకవర్గాల ఓటింగ్ జరగనుంది. షామ్లీ, ముజప్ఫర్ నగర్, మీరఠ్, బాగ్‌పట్, ఘజియాబాద్, హాపుర్, గౌతమ్ బుద్ధ నగర్, బులంద్‌షహర్, అలీగఢ్, మథుర, ఆగ్రా జిల్లాల్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నిక జరుగుతుంది. యూపీలో మొత్తం 7 విడతలో పోలింగ్ జరగనుంది. మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు. ఆ రోజు ఎవరూ రాజు తెలియనుంది. యూపీలో విజయం సాధిస్తే.. దేశంలో అధికారం చేపట్టడం ఖాయం అని బలంగా నమ్ముతారు. ఎందుకంటే ఇక్కడ 80 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీకి బంపర్ మెజార్టీ వచ్చిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications