Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ రెస్టారెంట్ చేసిన పనికి.. తీవ్ర మానసిక క్షోభ,అపరాధ భావం.. రూ.1కోటి పరిహారం డిమాండ్ చేస్తున్న మహిళ

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కి చెందిన ఓ మహిళ ఓ పిజ్జా రెస్టారెంట్‌పై వినియోగదారుల కోర్టులో కేసు వేసింది.ఆ రెస్టారెంట్ యాజమాన్యం నుంచి తమకు రూ.1కోటి పరిహారం ఇప్పించాలని కోర్టును కోరింది. ఆ రెస్టారెంట్ చేసిన పనికి తాము తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నామని... తమ మతపరమైన మనోభావాలకు తీవ్ర భంగం వాటిల్లిందని వాపోయింది. ఈ అపరాధ భావన నుంచి బయటపడేందుకు జీవితాంతం అత్యంత ఖర్చుతో కూడిన పూజలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఇంతకీ ఆ రెస్టారెంట్ చేసిన పనేంటి... వాళ్ల మనోభావాలు ఎందుకంతలా దెబ్బతిన్నాయి...?

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...

పిటిషనర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం... ఘజియాబాద్‌కి చెందిన దీపాళి,ఆమె కుటుంబం పూర్తిగా శాఖాహారులు. తరతరాలుగా శాఖహారాన్ని ఒక సంప్రదాయంలా పాటిస్తున్నారు. రెండేళ్ల క్రితం మార్చి 21,2019న దీపాళి ఒక పిజ్జా రెస్టారెంట్ నుంచి మష్రూమ్ పిజ్జా ఆర్డర్ చేశారు. ఆరోజు హోళీ కావడంతో కుటుంబమంతా హోళీ ఆడి అలసిపోయారు. అంతా ఆకలి ఉండటంతో రెస్టారెంట్ నుంచి వెజిటేరియన్ పిజ్జా ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసి 30 నిమిషాలు దాటినా డెలివరీ రాలేదు. ఇంకాస్త సమయం గడిచాక ఎట్టకేలకు పిజ్జా బాయ్ వచ్చి డెలివరీ ఇచ్చి వెళ్లాడు.

తిన్నాక అసలు విషయం తెలిసింది...

తిన్నాక అసలు విషయం తెలిసింది...

ఆకలి మీద ఉండటంతో అంతా త్వరగానే పిజ్జాను ఆరగించేశారు. కానీ ఆ తర్వాత వారు గ్రహించింది ఏంటంటే... అది నాన్ వెజ్ పిజ్జా. పిజ్జాపై ఉన్న ముక్కలను మష్రూమ్(పుట్ట గొడుగులు) అనుకుని తినేశామని... కానీ అవి మాంసపు ముక్కలు అని తెలియడంతో షాక్ గురయ్యామని దీపాళి తెలిపారు. అప్పటినుంచి తీవ్ర అపరాధ భావం తమను వెంటాడుతోందని చెప్పారు. ఇలా తప్పుడు ఫుడ్ ఐటెమ్ డెలివరీ చేసినందుకు ఆ రెస్టారెంట్ యజమానిని నిలదీశానని... కావాలంటే మీ ఫ్యామిలీ మొత్తానికి ఫ్రీ పిజ్జా డెలివరీ చేస్తానని అతను చెప్పాడన్నారు. ఒకరకంగా ఇది కూడా తమను అవమానించడమేనని పేర్కొన్నారు.

రూ.1కోటి పరిహారం ఇప్పించాలని...

రూ.1కోటి పరిహారం ఇప్పించాలని...

ఆ పిజ్జా తిన్నప్పటి నుంచి మానసిక వేదన తీవ్రమైందని... ఈ అపరాధ భావాన్ని తొలగించుకోవాలంటే జీవితాంతం అత్యంత ఖర్చుతో కూడిన పూజలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.తమ మత విశ్వాసాల ప్రకారం ఏ జంతువునైనా సరే చంపి తినడం అత్యంత అనైతికమని పేర్కొన్నారు. అలాంటిది ఆ రెస్టారెంట్ యాజమాన్యం చేసిన పనికి తమ మనసులు తీవ్రంగా గాయపడ్డాయని అన్నారు. పిజ్జా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కోర్టుకు రావాల్సి వచ్చినట్లు తెలిపారు. తమను ఇంత మానసిక క్షోభకు గురిచేసిన ఆ రెస్టారెంట్ యాజమాన్యం నుంచి రూ.1కోటి పరిహారం ఇప్పించాలని కోర్టును కోరారు. దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు ఆ రెస్టారెంట్ యాజమాన్యాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 17కి వాయిదా వేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+