విమానాల్లో దర్జాగా జర్నీ, వీళ్ల ముందు ఇంజనీరింగ్ చేసిన టెక్కీలు వేస్ట్ బ్రదర్!
బెంగళూరు/మంగళూరు: చోరీలు చెయ్యడానికి దొంగలు ఎత్తులకు పైఎత్తులు వేస్తుంటారు. దొంగలను పట్టుకోవడానికి డిగ్రీలు పూర్తి చేసి అత్యున్నత టెక్నాలజీ ఉపయోగిస్తున్న పోలీసులకు రవ్వ లడ్డూ తినిపిస్తున్న దొంగలు ఎస్కేప్ అవుతున్నారు. చదువుకున్న వాడికంటే వాడు ? మేలు అనే సామెతలా దొంగలు విమానాల్లో (airplanes) తిరుగుతూ లూటీలు చెయ్యడంతో పోలీసులు హడలిపోతున్నారు.
కర్ణాటకలోని మంగళూరులో వీకెండ్ లో రైళ్లలో చోరీలు చెయ్యడానికి విమానంలో (airplanes) వచ్చి రైలు ప్రయాణికుల బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు హైటెక్ దొంగలను రైల్వే (trains) పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్టు అయిన వారిని ఉత్తరప్రదేశ్‌లోని (uttar pradesh) మీర్జాపూర్‌లోని ధోరుపురాకు చెందిన అభయ్‌రాజ్ సింగ్ (26), రాజ్‌పూర్‌కు చెందిన హరిశంకర్ గిరి (25)గా గుర్తించామని పోలీసు అధికారులు తెలిపారు.
నిందితులు ఉత్తరప్రదేశ్ (uttar pradesh) నుంచి మంగళూరుకు దర్జాగా విమానంలో (airplanes) వచ్చి హోటల్ లో బసచేస్తున్నారు. రాత్రి వేళల్లో పలు ప్రాంతాలకు సంచరించే రైళ్లను ఎంచుకుని దొంగతనాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. రైలులో (trains) బంగారు ఆభరణాలు ధరించిన వృద్ధులు, మహిళలున నిదితులు టార్గెట్ చేసుకుంటున్నారు. రైలు వేగం తగ్గుతున్న సమయంలో మహిళల వద్ద ఉన్న బంగారు ఆభరణాలను లాక్కొని కోచ్‌లపై నుంచి చాకచక్యంగా కిందకు దూకుతున్న అభయ్ రాజ్ సింగ్, హరిశంకర్ గిరి తప్పించుకుని పారిపోతున్నారని పోలీసులు అన్నారు.

సెప్టెంబరు 28వ తేదీన కర్ణాటకలోని మంగళూరు-సూరత్‌కల్ మధ్య వెళ్తున్న రైలులో (trains) ప్రయాణికుల బంగారు ఆభరణాలు చోరీకి గురైందని ఫిర్యాదు చేశారు. ఇద్దరు యువకుల తీరుపై ఆర్పీఎఫ్ పోలీసులకు అనుమానం రావడంతో కొన్ని రోజుల తరువాత అభయ్ రాజా సింగ్, హరిశంకర్ లను అరెస్టు చేశారు. రైలు (trains) ప్రయాణికుల బంగారు నగలు లూటీ చేసినట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు.

అనంతరం నిందితులను మంగళూరు రైల్వే పోలీసుల కస్టడీకి అప్పగించారు. పాలక్కాడ్, తిరువనంతపురం, కొంకణ్ రైల్వే (trains) జోన్‌లలో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల (airplanes)నుంచి చోరీకి గురైన బంగారు ఆభరణాలతో పాటు మొత్తం 125 గ్రాముల బంగారాన్ని నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నామని, నిందిలుతులు కుదవప పెట్టిన బంగారు నగలు రికవరీ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications