ఇద్దరు యువకుల పెళ్ళి: ఇండియాలో మొదటి గే మ్యారేజీ

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: ఇండియాలోనే మొట్టమొదటి స్వలింగ సంపర్కుల వివాహం మహారాష్ట్రలోని యావత్మల్‌లో జరిగింది. యావత్మల్‌కు చెందిన రిషికేష్‌(40), చైనాకు చెందిన్‌ విన్హ్‌ డిసెంబరు 30, 2017న జరిగిన సంప్రదాయక ఉత్సవంలో ఒక్కటయ్యారు.

వీరిద్దరూ కాలిఫోర్నియాలోని ఓ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. వివాహానికి మొత్తం 70 నుంచి 80 మంది మాత్రమే అతిధులు వచ్చారు. వీరిలో 50 మంది అమెరికా, చైనాల నుంచి వచ్చిన స్నేహితులు. మరో పది మంది స్వలింగ సంపర్కులు. రిషికేష్ పట్టుబట్టి విన్హ్‌నే పెళ్ళి చేసుకొన్నాడు.

US-based IIT grad marries gay partner in Maharashtra

చేసుకునేదేదో మన ప్రాంతానికి వచ్చి సంప్రదాయక ఉత్సవంలో చేసుకోవాలని కోరడంతో వారిద్దరూ కూడ ఇండియాకు వచ్చి వివాహం చేసుకొన్నారు. పెళ్లి అయిన మరుసటిరోజే హనీమూన్‌కు వెళ్లారు.

ఇదేం పెళ్లి అంటూ స్థానికంగా యావత్మల్‌వాసులంతా ముక్కున వేలేసుకున్నారు.విదేశాల్లో కూడ స్వలింగ సంపర్కుల వివాహలకు చట్టబద్దత కల్పిస్తున్నారు. అయితే ఇండియాలో మాత్రం వీరిద్దరి వివాహం తొలి వివాహంగా రికార్డు సృష్టించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
As they say, love always finds a way. A US-based Indian engineer married his gay lover in a traditional ceremony at Yavatmal on December 30

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి